Union Minister verbal spat wit Karnataka Minister కర్ణాటక మంత్రిపై కేంద్రమంత్రి కస్సుబుస్సు

Caught on cam nirmala sitharaman s verbal spat with karnataka minister

nirmala sitharaman,nirmala sitharaman speech,nirmala sitaraman sara mahesh,nirmala sitharaman verbal spat, minister nirmala sitharaman,sara mahesh, sara mahesh nirmala sitharaman,union minister vs karnataka minister, nirmala sitharaman kodagu,nirmala sitharaman pariwar, nirmala sitharaman bjp, nirmala sitharaman unsheduled programme, kodagu floods, Nirmala sitharaman verbal spat

Union Defence Minister Nirmala Sitharaman has lost her cool and she had a verbal spat with Karnataka Minister Sara Mahesh during her visit to landslide hit Kodagu.

ITEMVIDEOS: కేంద్రమంత్రి నిర్మలా సితారామన్ పై నెట్ జనుల విమర్శలు..

Posted: 08/25/2018 11:37 AM IST
Caught on cam nirmala sitharaman s verbal spat with karnataka minister

కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ పై నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశానికి రక్షణశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న అమెకు చాలా సహనం, ఓర్పు ఉండాల్సిందిపోయి.. ముక్కు మీద కోపం.. అహంకారంతో వ్యవహరించరాదని అమెకు నెట్ జనులు సూచిస్తున్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన అమె.. రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా కొడుగు ప్రాంతవాసులు వరదల కారణంగా ముంపుకు గురై కష్టాల్లో వుంటే వారికి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిపోయి తనకు తన పరివారమే ( బీజేపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు) ముఖ్యమని బాహాటంగా చెప్పడం ఎంతవరకు సమంజసమని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేయాలని, ఆ తరువాత రాజకీయాలకు అవకాశం లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు నిత్యం రాజకీయాలు చేస్తూన్నారని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తమదైన శైలిలో ప్రచారం చేసిన ప్రస్తుత ప్రధాని మాటలను తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రే నిజం చేస్తున్నారని నెట్ జనులు చురకలంటిస్తున్నారు. ఇప్పటికే కొడుగులో పర్యటించిన కేంద్ర రక్షణ మంత్రి కనీసం తక్షణ సాయంగా ఒక్క రూపాయి కూడా ప్రకటించకుండా వెళ్లడంపై మండిపడుతున్న నెట్ జనులు.. అమె కేంద్ర రక్షణ శాఖ మంత్రి హోదాలో తమ పరివారమే ముఖ్యమన్న మాటలను ఎలా సమర్థించుకుంటారని నిలదీస్తున్నారు.

అసలేం జరిగింది అంటే.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక మంత్రి సారా మహేశ్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉఫ్.. ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నా.. అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే.. బిజీ షెడ్యూల్ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి సమాయాభావం నేపథ్యంలో మీడియా సమావేశాన్ని త్వరగా ముగించాలని మంత్రి సారామహేశ్ తనను కోరడంపై మండిపడ్డారు. కొడగు జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా 16 మంది చనిపోగా, భారీ ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆర్మీ చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఆమె కొడగుకు చేరుకున్నారు. జిల్లాలో బాధితులను సీతారామన్ పరామర్శించారు.

అనంతరం అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీతారామన్ మాట్లాడుతుండగా కొద్దిసేపటి తర్వాత మంత్రి మహేశ్ బీజీ షెడ్యూల్ కారణంగా మీడియా సమావేశాన్ని త్వరగా ముగించాలని సూచించారు. దీంతో సహనం కోల్పోయిన ఆమె.. ‘నేను కేంద్ర మంత్రిని. కానీ మీరు చెప్పినట్లు నడుచుకోవాల్సి వస్తోంది. నమ్మలేకున్నా’ అని వ్యాఖ్యానించారు. తాను అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. మీకు మీ అధికారులు ముఖ్యమైతే మాకు మా పరివారం అంతకన్నా ముఖ్యమని గద్దించారు.

అసలేం జరిగిందీ అంటే.. కొడుగు పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారమన్ షెడ్యూలు బిజీగా వుంది. తన షెడ్యూలు ప్రకారం నడుచుకుంటానని చెప్పిన మంత్రి దానిని అతిక్రమించడమే మంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడానికి అసలు కారణం. కొడుగులో బీజేపి నిర్వహిస్తున్న సహాయక శిబిరానికి వెళ్లిన కేంద్రమంత్రి అక్కడ బాధితులతో పాటు బీజేపి నేతలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు. ఇది అమె షెడ్యూలులో లేని కార్యక్రమం. అక్కడే అధిక సమయం కేటాయించిన మంత్రి మిగతా కార్యక్రమాలకు అలస్యమవుతుందని. ప్రెస్ మీట్ ను త్వరగా ముగించాలని సూచించిన మంత్రిపై కస్సుబుస్సుమంటే ఒంటికాలుపై లెవ్యడ్డాన్ని నెట్ జనులు తీవ్రంగా తప్పబడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka minister  union minister  sara mahesh  nirmala sitharaman  verbal spat  netizens  

Other Articles