Lalu Prasad Yadav Asked to Surrender by 30 August లాలూకు ఈ నెలాఖరే చివరి గడువు.. కొర్టు తీర్పు..

Lalu prasad yadav asked to surrender by 30 august

Lalu Prasad Yadav, Rashtriya Janata Dal, jharkhand high court, insulin, Bail, Mumbai, Ranchi, RIMS, RJD, Rashtriya Janata dal, Asian heart Institute, Tejeswi Yadav, Jharkhand

The Jharkhand High Court has asked Rashtriya Janata Dal (RJD) chief Lalu Prasad Yadav to surrender by 30 August, reported ANI. His request for 3 months’ bail extension on medical grounds has also been rejected by the court.

లాలూకు ఈ నెలాఖరే చివరి గడువు.. కొర్టు తీర్పు..

Posted: 08/24/2018 03:29 PM IST
Lalu prasad yadav asked to surrender by 30 august

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పొడగింపును కల్పించే అంశాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ పోగిడింపును కల్పించేందుకు ససేమిరా అన్న రాష్ట్రోన్నత న్యాయస్థానం.. ఆయనను ఈ నెల 30 లోగా లొంగిపోవాలని ఆదేశించింది. లాలూ బెయిల్ పొడగింపు పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాలూ తరుపున ఆయన న్యాయవాది కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు.

లాలూకు మరో మూడు నెలల పాటు బెయిల్ పొడగించాల్సిందిగా అప్రేశ్ కుమార్ నేత్రృత్వంలోని బెంచ్‌ను ఆయన కోరారు. అయితే న్యాయమూర్తి మాత్రం మూడు నెలలు కాదని, ఈ నెలాఖరులోగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని తీర్పునిచ్చింది. అయితే ప్రస్తుతం లాలూ ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో న్యాయస్థానం ఇచ్చిన తాజా అదేశాల నేపథ్యంలో లాలూను ముంబై నుంచి రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరలించనున్నారని ఆయన తరపు న్యాయవాదుల్లో ఒకరు తెలిపారు.

ఇదిలావుండగా, ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన కుమారుడు తేజస్వి పరామర్శించారు. లాలూ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రి అనారోగ్య పరిస్థితిని చూసి తీవ్రంగా కలత చెందానని పేర్కోన్నారు. ఇదే ఆసుపత్రిలో ఆయన కొద్ది రోజులకు బైపాస్ సర్జరీ జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. ఆయన తర్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles