Veteran journalist Kuldip Nayar passes away జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్

Veteran journalist kuldeep nayar dies tributes pour in

Kuldeep Nayar, Kuldeep Nayar dies, veteran journalist Kuldeep Nayar dies, journalist Kuldeep Nayar dies, senior journalist, passed away, PM Modi, Arvind Kejriwal, Parliamentarian, India

Eminent Indian writer and journalist Kuldip Nayar passed away in New Delhi on Thursday following a brief illness. He was 95. Mr. Nayar is a Punjabi, but was originally born in Sialkot in 1923.

ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కన్నుమూత..

Posted: 08/23/2018 10:36 AM IST
Veteran journalist kuldeep nayar dies tributes pour in

ప్రముఖ జర్నలిస్ట్‌, మాజీ పార్లమెంటు సభ్యుడు, బ్రిటన్‌ మాజీ హైకమిషనర్‌ కుల్దీప్‌ నయ్యర్‌ కన్నుమూశారు. 95ఏళ్ల నయ్యర్‌ అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 12.30 సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుల్దీప్‌ నయ్యర్‌ అంతిమ సంస్కారాలు నగరంలోని లోధి స్మశానవాటికలో జరుగుతాయని నయ్యర్‌ పెద్ద కుమారుడు సుధీర్‌ నయ్యర్‌ వెల్లడించారు.

1923, ఆగస్టు 14న పాక్‌లోని సియోల్‌కోట్‌లో 1923 ఆగస్టు14న జన్మించిన కుల్దీప్‌ నయ్యర్‌ సీనియర్‌ జర్నలిస్ట్ గా‌, రచయితగా విశేష సేవలందించారు. నయ్యర్‌ ‘బియాండ్ ‌ద లైన్స్’, ‘ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ’ సహా తదితర ఎన్నో ప్రముఖ రచనలు చేశారు. మానవ హక్కుల కార్యకర్తగానూ పనిచేశారు. 1990లో బ్రిటన్‌లో భారత హైకమిషనర్ గా సేవలందించారు. 1997లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు.

కుల్దీప్‌ నయ్యర్‌ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘కుల్దీప్‌ నయ్యర్‌ మా కాలంలోని మేధో దిగ్గజం. ఆయన అభిప్రాయాలు నిజాయితీగా, నిర్భయంగా ఉంటాయి. ఆయన కొన్ని దశాబ్దాల పాటు సేవలందించారు. ఎమర్జెన్సీని బలంగా వ్యతిరేకించిన వ్యక్తిగా, దేశంలో పబ్లిక్‌ సర్వీసులు, కమింట్‌మెంట్స్‌ మరింత మెరుగుపడాలని తీవ్రంగా కోరుకున్న వ్యక్తిగా ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన మరణం ఎంతో బాధ కలిగించింది. సంతాపం తెలియజేస్తున్నా’ అని మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా నయ్యర్ కు నివాళులర్పిస్తూ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్టు, మానవ హక్కుల కోసం పోరాడిన ధీశాలి కుల్దీప్ నయ్యర్ మరణవార్త తనను చాలా దిగ్ర్భాంతికి గురిచేసిందని అన్నారు. కాలమిస్టుగా ఆయన తన భావాలను స్పష్టంగా నిజాయితీగా వ్యక్తపర్చారని, పాత్రికేయరంగానికి ఆయన చేసిన కృషి అనన్యమనదని, అది ఎప్పటికీ నిలచిపోతుందని కేజ్రీవాల్ ట్వీట్ లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది సీనియర్‌ జర్నలిస్టులు, ప్రజలు నయ్యర్‌ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kuldip Nayar  senior journalist  passed away  PM Modi  Arvind Kejriwal  Parliamentarian  India  

Other Articles