Will give a strong reply when needed: Sidhu సమయం వచ్చినప్పుడు గట్టిగా బదులిస్తా: సిద్దూ

Hug with pak army chief bajwa an emotional response says sidhu

Punjab Chief Minister Amarinder Singh, Opposition, Navjot Singh Sidhu, Imran Khan, Gurdwara Kartarpur Sahib, sidhu on pak visit, Pakistan Army chief, Qamar Javed Bajwa

After drawing flak from Punjab CM and the Opposition for embracing the Pakistan Army chief, cricketer-turned-politician Navjot Singh Sidhu said that he was prepared to give a strong reply to all when needed.

సమయం వచ్చినప్పుడు గట్టిగా బదులిస్తా: సిద్దూ

Posted: 08/21/2018 09:58 AM IST
Hug with pak army chief bajwa an emotional response says sidhu

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లి విమర్శల పాలైన మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తనపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. సమయంతో పాటు అలాంటి అవసరం వచ్చినప్పుడు తన విమర్శకులపై గట్టిగా సమాధానం చెబుతానని పేర్కొన్నారు. ‘‘నాపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన రోజు వచ్చినప్పుడు అందరికీ ఇస్తా. అది చాలా గట్టిగా ఉంటుంది’’ అని సిద్ధూ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ వెళ్లని సిద్ధూ అక్కడ ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ ను ప్రేమగా ఆలింగనం చేసుకోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. సొంత ప్రభుత్వ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా సిద్ధూ చర్యను తప్పుబట్టారు. బజ్వాను హగ్ చేసుకోవడం తప్పేనని వ్యాఖ్యానించారు. ‘‘సిద్ధూ అలా చేయడం తప్పేనని అనుకుంటున్నా. జావేద్‌పై మరీ అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. మన సైనికులు రోజూ అమరులవుతున్నారు. దీని వెనక ఎవరున్నదీ సిద్ధూ అర్థం చేసుకోవాలి అని అన్నారు.

కొన్ని నెలల క్రితం నా సొంత రెజిమెంట్ కూడా ఓ మేజర్, ఇద్దరు జవాన్లను కోల్పోయింది’’ అని అమరీందర్ పేర్కొన్నారు. సిద్ధూ పాక్ వెళ్లాలన్నది అతడి వ్యక్తిగత నిర్ణయమని, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన సిద్ధూ మాట్లాడుతూ తన చర్యలను సమర్థించుకున్నారు. కర్తార్ పూర్ లోని చారిత్రక గురుద్వారాకు మార్గాన్ని తెరుస్తామని చెప్పడంతో ఆనందంతోనే జావేద్ ను కౌగిలించుకున్నానని వివరించారు.

‘‘ఎవరైనా (జావేద్ ను ఉద్దేశించి) నా వద్దకు వచ్చి తాము కూడా అదే సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తామని, గురునానక్ 550వ జన్మదినం సందర్భంగా కర్తార్ పూర్ సరిహద్దును తెరుస్తామని చెప్పినప్పుడు నేనేం చేయాలి?’’ అని ప్రశ్నించారు. ‘‘మిమ్మల్ని అతిథిగా ఆహ్వానించినప్పుడు మీరెక్కడో కూర్చున్నారు. అలాగే నేను కూడా ఎక్కడో కూర్చున్నాను. కానీ వారొచ్చి అక్కడ కూర్చోమని చెప్పారు’’ అని సిద్ధూ వివరించారు. కాగా, తనపై వెల్లువెత్తుతున్న విమర్శల జడివానపై స్పందిస్తూ.. అవసరం వచ్చినప్పుడు అందరికీ సరైన సమాధానాన్ని ఘాటుగా ఇస్తానని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles