MLA broke down bring navy rescue ops to chengannur చెనగన్నూర్ కు నావికాదళ సిబ్బంది బోట్లు..

Declare kerala floods a national disaster demands rahul

Kerala Floods, Rahul Gandhi, national disaster, subramanyan swamy, national relied fund, saji cherian, chengannur, Kerala Rain, IMD, depression, PC Chacko, PM Modi, Kerala floods 2018, Kerala landslides, Kerala flood, Kerala rains, Kerala rains, Kerala flood news, Floods in Kerala, Idukki dam, Kerala CM Pinarayi Vijayan, Governor P. Sathasivam, Union Tourism Minister KJ Alphons

Following Chengannur MLA Saji Cherian's remarks, the Navy has sent 10 boats to Chengannur. On the other hand Congress president Rahul Gandhi has asked PM Modi to declare Kerala floods a national emergency without any delay.

ITEMVIDEOS: కేరళ వరదలు.. జాతీయ విపత్తు ప్రకటనంత సీరియస్ కాదా.?

Posted: 08/18/2018 04:12 PM IST
Declare kerala floods a national disaster demands rahul

మలయాళ రాష్ట్రంపై వరుణుడు తన ప్రకోపాన్ని చాటుతూ కాకవికళం చేస్తున్న క్రమంలో.. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 'ప్రధాని గారూ... కేరళలో గత వందేళ్లలో కనివినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పరిస్థితులు అత్యంత తీవ్రంగా వున్నాయి. కేరళ వరదలను ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా జాతీయ విపత్తుగా ప్రకటించండి. లక్షలాది మంది ప్రజల ప్రాణాలు, జీవనోపాధి ప్రమాదంలో పడింది' అని ఆ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు.

ప్రధాని కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌తో జరిపిన సమీక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని అని విధాలుగా అదుకోవాలని మోడీని కోరారని చెప్పిన ఆయన.. అస్తులను, అయినవారిని కోల్పోయి అన్ని విధాలుగా అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరింతగా ముందుకురావాలని తాజా ట్వీట్ ద్వారా కోరారు.

తమ పార్టీ కేరళ విభాగం డిమాండ్ ను కేంద్రం ఎదుట ఉంచారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి మళయాలీయులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, కేంద్రం మరిన్ని రక్షణ బలగాలను రంగంలోకి దింపాలని ఆయన కోరిన విషయం తెలిసిందే. అయితే బీజేపి మాత్రం తమదైన శైలిలో స్పందించింది. కాంగ్రెస్ డిమాండ్ ను తోసిపుచ్చింది. బీజేపి పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ కేరళ పరిస్థితి దిగ్ర్భాంతి కలిగిస్తుందని అంటూనే.. వరదలు సహజమని.. అయితే కేంద్రం చేయగలిగిన సాయం చేస్తుందనే ఆయన వ్యాఖ్యానించారు.

ఇక మరోవైపు తన నియోజకవర్గంలోని పరిస్థితి లైవ్ టీవీలో వివరిస్తూ.. బావోద్వేగానికి గురైన చెనగన్నూర్ ఎమ్మెల్యే సాజీ చెరియన్ కంటతడి పెట్టిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో సహాయక చర్యలను చేపట్టేందుకు నావికాదళం పది బోట్లను పంపింది. నిన్న రాత్రి స్థానిక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో దాదాపు 50 మంది మృతి చెందారని ఇంకా ఎందరో ఇళ్లలోని పైకప్పులపై సహాయం కోసం ఎదురుచూస్తున్నారని.. వారిని వెంటనే అదుకోవాలని ఆయన కంటతడి పెట్టారు.

‘‘దయచేసి ప్రధాన మంత్రి మోడీని హెలికాప్టర్లు పంపమని అడగండి. హెలికాప్టర్లు పంపండి. ప్లీజ్ ప్లీజ్.. లేకపోతే 50వేల మంది చనిపోతారు. గత నాలుగు రోజుల నుంచి మేము నావికాదళం సాయం అడుగుతున్నాం. ఇప్పటి వరకు వారి సాయం అందలేదు. ఇక్కడ వరదలో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు కేవలం ఎయిర్ లిఫ్టింగ్ ఒకటే పరిష్కారం.. ప్లీజ్, ప్లీజ్’’ అంటూ బాధను వ్యక్తం చేశారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాలలో చెనగన్నూర్ కూడా తీవ్రంగా నష్టపోయిందని, ఆ ప్రాంతం మొత్తం జలదిగ్భధనంలో చిక్కుకుందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles