Bandgi Kalra in Trouble For Posting Fake iPhone X Ad యువరాజ్ సింగ్ కు నకిలీ ఐఫోన్.. నటి బండ్డీ కల్రాపై కేసు..

Ex bigg boss contestant bandgi kalra booked for fake iphone ad

Bandgi Kalra, Actress, Bigg Boss 11, Yuvraj Singh Yadav, Delhi engineer, summoned, Instagram, Marathahalli police station, Bengaluru, brand ambassador, Different Collection, Nexafation.com, karnataka, crime news

Bigg Boss 11 contestant and Actress Bandgi Kalra has been booked for posting a fake iPhone advertisement on picture sharing app Instagram and has cheated a Delhi-based engineering student named Yuvraj Singh Yadav,

యువరాజ్ సింగ్ కు నకిలీ ఐఫోన్.. నటి బండ్డీ కల్రాపై కేసు..

Posted: 07/23/2018 11:43 AM IST
Ex bigg boss contestant bandgi kalra booked for fake iphone ad

బిగ్‌బాస్ -11 తొ సెలబ్రిటీగా మారడంతో పాటు నటిగా కూడా అవకాశాలు సంపాదించుకున్న కంటెస్టెంట్ బంగ్డీ కల్రాపై కేసు నమోదైంది. బిగ్ బాస్ తో అమె సంపాదించిన ఫేమ్ ను తమ వాణిజ్య ప్రకటనలకు వినియోగించిన రెండు సంస్థలు అమెను తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవడం.. అందుకు అమె అంగీకరించడం.. ఫలితంగా అవి ఫేక్ సంస్థలని తేలడం.. సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న కల్రాపై బాధితుడు పిర్యాదు చేయడం.. పోలీసులు అన్ని పరిశీలించన తరువాత అమెపై కేసును నమోదు చేయడం.. ఇదండీ సంగతీ.

తనకు ఫేక్ ఐఫోన్లు విక్రయించిందంటూ బెంగళూరులో నివసిస్తున్న ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి కల్రాతోపాటు ఢిల్లీకి డిఫరెంట్ కలెక్షన్, నెక్సాఫేషన్ డాట్‌ కామ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు శివారులోని మరథహళ్లికి చెందిన యువరాజ్ సింగ్ యాదవ్.. నటి కల్రా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను చూశాడు. అందులో రెండు కొత్త ఐఫోన్ ఎక్స్ మొబైళ్లు రూ.61 వేలకే అందుబాటులో ఉన్నట్టు ఉంది. ఇదేదో బాగానే ఉందని భావించిన యువరాజ్ సింగ్ పేటీఎం ద్వారా రూ.13 వేలు చెల్లించి వాటిని బుక్ చేసుకున్నాడు. తర్వాత తనకు పార్శిల్ రావడంతో మిగతా డబ్బులు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. అనంతరం పార్శిల్ విప్పి చూడగా అందులో రెండు నకిలీ ఐఫోన్లు కనిపించాయి.

దీంతో నిశ్చేష్టుడైన యువరాజ్ సింగ్ వెంటనే నటికి, ఆయా సంస్థలకు ఫోన్ చేశాడు. అయితే, వారి నుంచి అతడికి స్పందన రాలేదు. తన అవేదనను వెలిబుచ్చుతూ మరథహళ్లి పోలీసులకు యువరాజ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. కల్రాకు, బాధితుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కల్రా తన ఈమెయిల్ ఐడీతోపాటు పైన పేర్కొన్న రెండు సంస్థల ఈమెయిల్ ఐడీలను బాధితుడికి పంపింది. నటి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫేక్ కాదని తేలడంతో కల్రాతోపాటు రెండు సంస్థలను విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఢిల్లీ పంపినట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandgi Kalra  Actress  Bigg Boss 11  Yuvraj Singh Yadav  Delhi engineer  Instagram  Bengaluru  crime news  

Other Articles