multiplexes, theaters to allow outside food సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులోకి ఇక బయటి అహారం..

Multiplexes theaters to allow outside food in telangana

Movie Theaters, Movie Products, food items, INOX Leisure Ltd, Maharashtra, Telangana, Hyderabad, Mumbai, , PVR Ltd, retail price, outside food in theaters, outside food in multiples

After Maharashtra Government took action and requested multiplex, movie theaters owners to permit movie-goers to bring their own food items as well as reduce the price of eatables sold inside the premises, now telangana government also issued the same orders.

సర్కార్ సంచలన నిర్ణయం.. మల్టీప్లెక్సులో బయటి అహారం..

Posted: 07/19/2018 07:46 PM IST
Multiplexes theaters to allow outside food in telangana

తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయాలు పడిన నేపథ్యంలో ఎవరైనా తమ ప్రభుత్వంపై కూడా న్యాయస్థానాన్ని అశ్రయిస్తే.. అక్కడి వెళ్లిన తరువాత పరిస్థితిని చూసుకుందామన్న భావనను రానీయకుండా.. ముందుగానే అలర్గ్ అయ్యింది. మహారాష్ట్ర సర్కార్ కు తగిలిన దెబ్బను.. ప్రతిపక్ష పార్టీకి అది అస్త్రంగా మారిన తరుణంలో.. అలాంటి అవకాశాలను కూడా ప్రత్యర్థులకు ఇవ్వకూడదని బావించి మహారాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన తాజా అదేశాలను తెలంగాణలో కూడా అమలు పర్చాలని అధికారగణాన్ని అదేశించింది.

ఇంతకీ ఇదంతా ఏ విషయంలో అంటారా..? సినిమా ధియేటర్లు, మల్టీఫ్లెక్సుల్లో కళ్లముందు బాహాటంగా జరుగుతున్న దోపిడి అంశంలో. ఓ కుటుంబం సినిమా చూసి బయటకు రావాలంటే రూ. 2 వేలు చాలని పరిస్థితి. ఓ మధ్య తరగతి కుటుంబం మల్టీ ప్లెక్స్ వైపు చూడాలంటేనే భయపడాల్సిన దుస్థితి. ఒక్కో ధియేటర్, మాల్స్ లో ఒక్కో ధర. బయటి మార్కెట్లో చౌకగా లభించే పధార్థాలకు ఇక్కడ మాత్రం వందల రూపాయలు విదిల్చాసిందే. పాప్ కార్న్ కావాలంటే 200, కూల్ డ్రింక్ కావాలంటే రూ. 80. కనీసం మంచినీళ్లు తాగుదామంటే రూ. 50 పెట్టాల్సిందే.

అయితే తాజాగా బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించిన అదేశాలతో అక్కడ అగస్టు 1 నుంచి మల్టీఫ్లెక్సుల్లో, సినిమా ధియేటర్లలో సగటు ప్రేక్షకుడు ఊపిరి తీసుకునేలా చర్యలు చేపట్టనుంది. అదే గుడ్ న్యూస్.. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ ప్రియులకు చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక మల్టీఫ్లెక్స్ ధియేటర్లకు బయట నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లవచ్చు. ఇకపై బయటి అహారాన్ని మాల్స్, ధియేటర్లు అడ్డుకోరాదని అదేశాలు వెళ్లాయి. అగస్టు 1 నుంచి ధరలఘాతాన్నికి చిక్కకుండా సినీప్రియులు చిత్రాలను అస్వాదించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : outside food  theaters  multiples  hyderabad  telangana  maharashtra  

Other Articles