Jet Airways flight tickets available now at big discounts జెట్ ఎయిర్ వేస్ విమాన టికెట్లపై భారీ రాయితీ

Jet airways offers up to 30 discount on domestic international flight tickets in new sale

Jet Airways flight offers, Jet Airways sale, Jet Airways discount offer, Jet Airways flight ticket offer, Jet Airways, Jet Airways offer on international flights, Jet Airways offer on flights, flight offers, discount offer, ticket offer, domestic tickets, international flights, Aviation

Under the latest sale, Jet Airways is offering up to 25% discount on domestic flight tickets and up to 30% on overseas flights. Jet Airways offer will remain open for bookings till 23 July.

జెట్ ఎయిర్ వేస్ విమాన టికెట్లపై భారీ రాయితీ

Posted: 07/19/2018 12:32 PM IST
Jet airways offers up to 30 discount on domestic international flight tickets in new sale

చౌకధర విమానయానం కల్పించే సంస్థ జెట్ ఎయిర్ వేస్ తాజాగా విమాన ప్రయాణికులకు మంచి ఆఫర్ ప్రకటించింది. తమ విమానాల్లో ప్రయాణించనున్న కస్టమర్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా రాయితీని ప్రకటించింది. జెట్ ఎయిర్ వేస్ దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో ప్రయాణించే వారికి 30 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్టు జెట్ ఎయిర్ వేస్ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద ఈ నెల 23 వరకు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశముందని ఆ సంస్థ తమ వెబ్ సైట్ లో పేర్కొంది.

దేశీయ ప్రయాణాల్లో ఎకానమీ క్లాస్ లో 25 శాతం వరకు రాయితీపై విమాన టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను కేటాయించారన్న విషయాన్ని మాత్రం విమానయాస సంస్థ ప్రకటించలేదు. ఇక అంతర్జాతీయ సర్వీసుల్లో ఎకానమీ, ప్రీమియం క్లాసులలో ఛార్జీల ఆధారంగా ఈ డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొంది. మాంఛెస్టర్ వెళ్లే ప్రయాణికులకు మాత్రం నవంబర్ 5 నుంచి ఈ ఆఫర్ వర్తించనుంది. తమ సంస్థకు యూరప్ లో భాగస్వాములైన ఎయిర్ ఫ్రాన్స్, కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ లో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది.

 కాగా, టొరెంటోకు వెళ్లే సర్వీసులకు, కోల్ కతా-ఢాకా వెళ్లే వన్ వే సర్వీసులకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదని ఆ వెబ్ సైట్ లో స్పష్టం చేసింది. ఇదిలా వుండగా భారత విమానయాన మార్కెట్ శరవేగంగా విస్తరిస్తుంది. గత ఏడాది కొత్తగా విమానయానం చేసిన వారి సంఖ్య 5.6 కోట్లు వుండగా, ఈ ఏడాది 6.8గా నమోదై ఏకంగా 22 శాతం గణనీయమైన అభివృద్దిని సాధించింది. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం కూడా విమానయాన ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు దోహదపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles