BJP MLA's wife appeals to PM for action ఈ బీజేపి ఎమ్మెల్యే మంచోడు కాదు: భార్య అరోపణ

Bjp mla s wife accuses him of having extramarital affair with college student

Monika Sharma, Gagan Bhagat, BJP legislator, illegal affair, punjab, student, ex servicemen, Aadhaar card, extra-marital affair, R S Pura constituency, Jammu district, jammu and kashmir, crime

A BJP legislator's wife publicly accused her husband of having an extra-marital affair with a college student and marrying her, in a fresh twist to a case that has seen the MLA appear before the disciplinary committee of the party.

నా భర్తపై చర్య తీసుకోరూ.. ప్రధానికి బీజేపి ఎమ్మెల్యే భార్య అభ్యర్థన

Posted: 07/14/2018 11:31 AM IST
Bjp mla s wife accuses him of having extramarital affair with college student

తన భర్త ఓ కాలేజీ విద్యార్థినితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడని, అమెను పెళ్లి కూడా చేసుకున్నాడని, ప్రజలందరూ విశ్వసిస్తున్నట్లు తన భర్త మంచోడు మాత్రం కాదని.. కర్కోటకుడని జమ్మూకాశ్మీర్ కు చెందిన ఓ ఎమ్మెల్యే భార్య.. స్వతహాగా బీజేపి మహిళా విభాగం నేతైన మోనికా భగత్ అరోపించారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ఆయన మరో అమ్మాయిని ఎలా వివాహం చేసుకుంటాడని అమె నిలదీశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా అమె లేఖ రాస్తూ.. తనకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.

ఆర్ఎస్‌ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్ భగత్‌.. పంజాబ్ కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారని జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి.. ఆయన భార్య మోనికా శర్మ ఆరోపించారు. ‘నా భర్త మంచోడు కాదు. గత కొంతకాలంగా ఓ కాలేజీ యువతితో అక్రమ సంబంధం నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆ అమ్మాయిని రహస్య వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకాలం సాక్ష్యాలు లేక ఆగిపోయా. ఇప్పుడు ఈ ఆధారాలతో(ఫోటోలు) మీ ముందుకు వచ్చా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. మీ బిడ్డకు జరుగుతున్న అన్యాయమనుకుని న్యాయం చేయండి’ అని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాలను అమె అభ్యర్థించారు.

ఇటీవల తాను పంజాబ్ యువతి ఇంటికి వెళ్లి.. అమెకు నచ్చజెప్పుదామని, నా సంసారంలో చిచ్చు పెట్టోదని కొరుదామని వెళ్లా.. అయితే అమె నన్ను చూసి చూడగానే ఇంట్లోంచి పరారయ్యింది. అయితే వెళ్లే క్రమంలో అమె మొబైల్ ఫోన్ కూడా అక్కడే వదిలేసి వెళ్లింది. దానిని పరిశీలించగా తన అరోపణలకు బలం చేకూరిందని, వారిద్దరూ వివాహం చేసుకున్నారని మోనిక అరోపించారు. వారిద్దరూ సన్నిహితంగా వున్న ఫోటోలు కూడా ఫోన్ లో వున్నాయని వాటిని కూడా తాను బీజేపి కమిటీ పెద్దలకు అప్పగించానని అన్నారు.

పంజాబ్ యువతి తాత అధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడంతో.. దిగివచ్చిన బీజేపి అధిష్టానం.. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కమిటీ ఎదుట వేర్వేరుగా హజరైన మోనికా, గగన్ లు వారి వారి వాదనలు వినిపించారు. అనంతరం బయటకు వచ్చిన గగన్.. తన భార్య మోనికా ఆరోపణలను తోసిపుచ్చారు. ‘మా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమె విడాకులు కోరింది. పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా వద్దని వారించా. ప్రస్తుతం కౌన్సిలింగ్‌ జరుగుతోంది.  అందుకే ఈ ఆరోపణలు’ అని గగన్‌ చెబుతున్నారు.

అయితే కౌన్సిలింగ్‌ జరుగుతున్న మాట వాస్తవమేనని, కానీ, చెల్లించాల్సిన భరణం కూడా గగన్‌ ఇవ్వట్లేదని మోనికా చెబుతున్నారు. న్యాయస్థానంలో ఒప్పందం మేరకు ప్రతి నెల లక్ష రూపాయల భరణం ఇస్తామని చెప్పిన గగన్.. వాటిని కూడా సరిగా చెల్లించడం లేదని మోనికా అరోపించారు. మరోవైపు గత నెల చివర్లో తన కూతురిని గగన్‌ అపహరించాడంటూ యువతి తంత్రి పంజాబ్ కు చెందిన మాజీ సైనికాధికారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు యువతిని రక్షించిన పోలీసులు మీడియా ముందుకు అమెను తీసుకురాగా, గగన్ చాలా మంచోడు అని యువతి కితాబివ్వడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles