In a first, rare albino cobra rescued in Bengaluru అత్యంత అరుదైన శ్వేతనాగు తొలిసారిగా..

In a first rare albino cobra rescued in bengaluru

Albino cobra, White cobra, bengaluru cobra rescued, Albino monocled cobra, Mathikere area, North-West Bengaluru, snake rescuer, Rajesh Kumar, bengaluru, karnataka

An Albino monocled cobra, popularly known as white cobra, was sighted and rescued for the first time ever in the city. The hatchling, which is not more than seven days old, was rescued from a house in Mathikere area of North-West Bengaluru by snake rescuer Rajesh Kumar M.

అత్యంత అరుదైన శ్వేతనాగు తొలిసారిగా..

Posted: 07/03/2018 01:17 PM IST
In a first rare albino cobra rescued in bengaluru

యావత్ దేశంలోనే అత్యంత అరుదైన పాము బెంగళూరలో దర్శనమివ్వడంతో.. భక్తుల్లో విశ్వాసాలకు మరింత పెంచుతుంది. శ్రావణమాస శుక్ల పక్షంలో పంచమి రోజున వచ్చే నాగుల పంచమి (ఆగస్టు 15) మరో నెల రోజుల్లో రావడం సరిగ్గా అదే సమయంలో ఒక శ్వేతనాగు తన పిల్లలను పెట్టడం.. అందులో ఒకటి బెంగుళూరు నగరంలో దర్శనమివ్వడం.. భక్తుల్లో విశ్వాసాలను మరింతగా పెంచుతుంది.

బెంగళూరు మహానగరంలోని మథికెరె ప్రాంతంలోని ఓ ఇంట్లో ప్రవేశించింది. ఇంటి యజమాని దానిని క్షుణ్ణంగా పరిశీలించగా, అది పాము తరహాలోనే పాకుతుండటంతో.. వెంటనే స్నేక్ రెస్క్యూయర్ (పాములు పట్టకునే వ్యక్తికి) రాజేశ్ కుమార్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. బెంగళూరు నగరంలో శ్వేత నాగును గుర్తించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ధవళ (వజ్ర) వర్ణ శరీరంతో మెరుస్తూ, ఎర్రటి కళ్లతో ఉండే ఈ పామును అత్యంత అరుదుగా కనిపిస్తుందని రాజేశ్ తెలిపారు.

 దేశం మొత్తంలో ఈ తరహా శ్వేతనాగులు కేవలం ఎనమిది నుంచి తొమ్మిది మాత్రమే వుంటాయని రాజేష్ తెలిపాడు. కాగా, తనకు పాము ఇంట్లోకి ప్రవేశించిందని యజమాని ఫోన్ చేశాడని, అయితే తాను కూడా ఇది సాధారణ నాగుపాముగా భావించానని అన్నారు. కానీ ఇక్కడికొచ్చి చూశాక అది అరుదైన శ్వేత నాగు అని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపారు. పావు అడుగు పొడవు మాత్రమే ఉన్న పామును పట్టుకొని వేరే సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టా’నని రాజేశ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Albino cobra  White cobra  bengaluru cobra rescued  Albino monocled cobra  bengaluru  karnataka  

Other Articles