Farmer’s daughters plough land for rain పొలం దున్నేందుకు జోడెడ్లుగా మారిన ఎదిగిన కూతుళ్లు..

Jhansi farmer s teenage daughters plough farmland instead of oxen

Farmer, teenage daughters, plough, farmland, oxen, rain god, weird superstitions, Farmland, Daughters, teenage, Farmer, Jhansi, Uttar Pradesh,

In a bizarre incident, a farmer’s two teenage daughters were seen ploughing the farmland instead of oxen in Uttar Pradesh’s Jhansi.

ITEMVIDEOS: పొలం దున్నేందుకు జోడెడ్లుగా మారిన ఎదిగిన కూతుళ్లు..

Posted: 07/02/2018 03:22 PM IST
Jhansi farmer s teenage daughters plough farmland instead of oxen

ఈడొచ్చిన ఇద్దరు కూతుళ్లు కాడెడ్లుగా మారారు. పోలం వున్నా ఎడ్లు లేకపోవడంతో దున్నకోవడం కష్టమైన తండ్రికి అండగా ఇలా మారారా.? అని అనుకుంటే తప్పే. ఎందుకంటే వీరు జోడెడ్లుగా మారడం వెనుక పెద్ద కథే వుంది. అయితే వీరు చెప్పిన కథ విన్నాక ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం వుందా.? అన్న సందేహాలు కలగక మానవు. మంత్రాలకు చింతకాయలు రాలవన్నది తెలిసిందే అయినా.. ఇంకా ఇలాంటి మూఢనమ్మకాల్లో దేశంలోని అనేక మంది ప్రజలు తమ బతుకులు ఈడుస్తున్నది సత్యం.

అందుకు ఈ కథనమే ఉదాహరణ. దేశ రాజధాని ఢిల్లీకి అత్యంత చేరువులో వున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ ప్రాంతం. ఓ రైతన్న అరక పట్టి దుక్కి దున్నుతుంటే ఆయన ఇద్దరు కూమార్తెలు అరకకు జోడెడ్లుగా మారారు. ఇంతకీ ఇలా ఎందుకు చేశారని వారిని ప్రశ్నిస్తే.. ఇలా చేయడం వల్ల వరణుడు కరుణిస్తాడని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని నమ్ముతున్నట్టు ఆ రైతు సహా రైతు బిడ్డలు తెలిపారు. వర్షాకాలం వచ్చినా వానలు పడటం లేదు. ఇలా కూతుళ్లను కాడెడ్లుగా మార్చి దుక్కి దున్నడం వల్ల వర్షం కురుస్తుందనే నమ్మకం ఉండటం వల్లే ఇలా చేశానని సదరు రైతు తెలిపాడు.

ఇలాంటి మూడనమ్మకాలతో ఇంకా దేశంలోని ప్రజలు వున్నారా.. అని ప్రశ్నించేలా వుందీ ఘటన. గత 70 ఏళ్లుగా పాలన సాగించిన ప్రభుత్వాలు చేయలేని పనులు తమ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేసుకుంటున్న ప్రధాని.. ఈ వార్తపై ఎలా స్పందిస్తారో.. అసలు స్పందిస్తారో లేదో అన్నది తేలాలంటే నిరీక్షించాల్సిందే. పలు కీలక సమయాల్లో వ్యూహాత్మక మౌనాన్ని వహించి.. మౌన్ మోదీగా మారే ప్రధాని.. ఇప్పుడూ అదే విధానం అవలంభిస్తారా.? లేదా అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farmer  teenage daughters  plough  farmland  oxen  rain god  jhansi  Uttar Pradesh  

Other Articles