pawan kalyan interacts with tribal youth at araku గిరిజనుల్ని బలహీనపర్చే వారిపై పోరాటం: పవన్

Pawan kalyan interacts with tribal youth at araku

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan interaction with tribal youth, vishakapatnam yatra, pawan kalyan araku yatra, Pawan Kalyan uttatandhra yatra, pawan at araku, araku tribals, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is on uttarandhra porata yatra reached vishakapatnam tribal region araku and interacts with the youth.

చంద్రబాబు ఇంటి కింద కూడా ఖనిజ సంపద: పవన్ కల్యాన్

Posted: 06/05/2018 09:45 AM IST
Pawan kalyan interacts with tribal youth at araku

ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని అధికారిక నివాసంలో కింద తవ్వినా ఏదో ఖనిజం ఉంటుంది జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చేరుకున్న ఆయన అరకులో గిరిజన యువతతో సమావేశమయ్యారు. అడవిపుత్రులుగా బాసిసుల్లుతున్న గిరిజనులు నిజమైన ప్రకృతి బిడ్డలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే గిరిజన తాండల్లో ఏళ్లుగా సమస్యలు తిష్టవేశాయని, వారి సమస్యలను గత ప్రభుత్వాలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.

ప్రకృతి, అడవులు ఇంకా మనకి మిగిలి ఉన్నాయంటే దానికి కారణం గిరిజనులేనని ఆయన కొనియాడారు. ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ల దగ్గర అవినీతి ఉండదు. దానిని దాటి ఏదో సంపాదించుకోవాలని అత్యాశతోనే అవినీతికి జీజం పడుతుందని ఆయన అరోపించారు. అయితే ఇది రాజకీయ నాయకుల ప్రోద్భలంతోనే జరుగుతుందని, వారికి ప్రభుత్వాలు కూడా అండగా నిలువడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. అయితే తాను అభివృద్దికి వ్యతిరేకం కాదని, ప్రగతిబాటలో మైనింగ్ చేయడం అవసరమేనన్న అయన అది ఎక్కడ తవ్వాలి? ఎంత మేరకు అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలని అన్నారు. ఇష్టానుసారంగా మైనింగ్ కు పాల్పడితే అవి ప్రకృతి, పర్యావరణానికి చేటని అన్నారు.

అమరావతిలో చంద్రబాబు ఇంటి కింద తవ్వినా ఏదో ఒక ఖనిజం దొరుకుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడికి గిరిజనులను రెచ్చగొట్టడానికో, మభ్యపెట్టడానికో , రాజకీయ అవసరాలకో రాలేదు. గిరిజనులకు అండగా ఉండేందుకే వచ్చానని.. వాళ్లను భయపెట్టి, బలహీనులుగా చేస్తే వారికి తమ పార్టీ అండగా వుంటుందని చెప్పడానికే వచ్చానన్న పవన్.. అవసరమైతే అలాంటి వారిపై పోరాడటానికి కూడా తమ పార్టీ సిద్దమని అన్నారు. గిరిజనులకు సాయం చేయడంలో అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు.

అయితే అందుకు తాను వారి నుంచి ఏమీ ఆశించడం లేదని కూడా చెప్పారు. గిరిజన ఏజెన్సీలలో అక్రమంగా సాగుతున్న బాక్సైట్ మైనింగ్ విషయంలో తాను అనునిత్యం గిరిజనులవైపునే పోరాడతానని హామి ఇచ్చారు. బాక్సైట్ తవ్వకాలపై గ్రామసభలు పెట్టి 70 శాతం ప్రజల ఆమోదంతోనే తవ్వకాలు జరపాలని ఆయన సూచించారు. ఏసీ గదుల్లో కూర్చొని.. గిరిజనులు తలరాతలు మారుస్తామంటే అవి సాధ్యపడదని అన్నారు. అడవిపుత్రుల జీవితాలు మారలాంటే.. అందుకు తగు అభివృద్ది కూడా కావాలని అన్నారు.

ఎన్నికలలో హామీలను ఇచ్చి వాటిని అమలు చేయలేని పార్టీలకు రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చుతాం అని టీడీపీ మేనిపేస్టోలో పెట్టి వాళ్లో ఓట్లు వేయించుకుందని అన్నారు. దానిని తాను ప్రశ్నించి.. హామీని నిలబెట్టుకోవాలని కొరితే.. గిరిజనుల్ని తనపైకి రెచ్చగొట్టారని విమర్శించారు. నాలుగు దశాబ్దాల చంద్రబాబు అనుభవం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టడానికే పనికి వచ్చిందంటూ జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles