Indore SP locked in room and robbed ఎస్పీని ఇంటినే దోచేశారు..

Armed assailants rob sp s house in indore

Miscreants, cctv, window, superintendent of police, locked, robbed, police officials, flee, debit cards, cash, sangeeta neke, Sangeeta, CCTV, baby rajore, ayushi neke, police quarters, indore, superintendent of police, sunil rajore, madhya pradesh

Four armed men barged into the govt residence of superintendent of police (SP) Sunil Rajore and robbed the house by locking him inside his bedroom.

పోలీస్ క్వార్టర్స్ లో దొంగలు.. ఎస్పీని ఇంటినే దోచిన వైనం..

Posted: 06/04/2018 02:28 PM IST
Armed assailants rob sp s house in indore

ఇప్పటికీ గ్రామాల్లోని చిన్నపిల్లలు ఎక్కువగా అడే అట దొంగా పోలీస్. పోలీస్ వస్తున్నాడంటే దొంగలు దాచుకునేవాళ్లు. అయినా దొంగలను గుర్తించి బంధించడం పోలీసుల పని. ఈ సత్యం రమారమి అందరికీ తెలిసిందే. దొంగలు పోలీసు కానిస్టేబుల్ వున్న పరిసర ప్రాంతాల్లోకి కూడా దొంగతనానికి వెళ్డడు. అయితే మధ్యప్రదేశ్ లోని దొంగలు మాత్రం బరితెగించిపోయారు. ఏకంగా పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే ఎస్పీ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ ఎస్పీ ఇంట్లో ఉండటంతో ఆయనను గదిలోనే బంధించి.. పనికానించేశారు. ఒకరు కాదు నలుగురు దొంగలు ఇలా చేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. కాగా ఒక్కడు మాత్రం పోలీసులకు చిక్కాడు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా ఎస్పీ సునిల్ రాజోరి ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. వేకువజామున 2 గంటల సమయంలో ఇంటి చుట్టూ వున్న ఫెన్సింగ్ ను కట్ చేసి.. కిటికీ ఊచలు తొలగించి.. వెనుక భాగం గుండా తన ఇంట్లోకి దొంగలు ప్రవేశించారని తెలిపారు. మొత్తంగా నలుగురు దొంగలు రాగా, వారిలో ఇద్దరు బయట పహారాగా వున్నారని, మరో ఇద్దరు లోనికి ప్రవేశించారన్నారు. తన భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లడంతో ఆ సమయంలో ఎస్పీ, అతడి తల్లి, తమ్ముడు, సోదరి, ఆమె కుమారుడు ఇంట్లో ఉన్నారు. ముందు ఎస్పీ తల్లి గదిలోకి ప్రవేశించిన దొంగలు, ఆమె పర్సులో ఉన్న డెబిట్ కార్డులు, నగదును తస్కరించారు.

అనంతరం ఎస్పీ నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియపెట్టారు. తర్వాత హాల్‌లో నిద్రిస్తోన్న తల్లి, సోదరిల దగ్గరకు వెళ్లేసరికి వారికి మెలకువచ్చింది. తక్షణమే సోదరి అతడికి ఫోన్ చేయగా, తల్లి ఎమర్జెన్సీ బెల్ మోగించి అప్రమత్తం చేసింది. దీంతో లోపలి నుంచి రావడానికి తాను ప్రయత్నించగా గడియవేసి ఉందని ఆయన తెలియజేశారు. వెంటనే తన సోదరికి ఫోన్ చేసి హాల్ తలుపులు మూసేయమని ఆదేశించాడు. నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు లోనికి ప్రవేశించగా, మరో ఇద్దరు బయటే కాపాలగా ఉన్నారని, బయట ఉన్నవారిని తాను సరిగ్గా చూడలేదని పేర్కొన్నారు. దీని గురించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో 20 నిమిషాల్లో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

పోలీసుల అలకిడి విని ముగ్గురు దొంగలు తప్పించుకోగా, లోపలి ఉండిపోయిన ఒక్కడు మాత్రం పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాను ఖర్గోన్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అతడు విచారణలో వెల్లడించాడు. ఎస్పీ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయనే ఉద్దేశంతోనే దొంగతనానికి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. వారికి ఎలాంటి విలువైన వస్తువులు లభించకపోవడంతో తమ వెంట తెచ్చుకున్న బ్యాగులను బయటే వదిలేసి పారిపోయారు. అంతేకాదు ముందుజాగ్రత్తగా ఇంటి పరిసరాల్లో సీసీటీవీ వైర్లను సైతం కత్తిరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : miscreants  police quarters  indore  superintendent of police  sunil rajore  madhya pradesh  

Other Articles