BJP walks out of KK Assembly during trust vote విశ్వాస పరీక్షకు ముందే బీజేపి ఇలా తప్పించుకుంది..

Karnataka floor test bjp walks out during trust vote

AR Ramesh kumar, karnataka speaker, Kumara Swamy, trust vote, bjp, walkout, vidhana soudha, karnataka assembly, vidhana soudha, Siddaramaiah, Congress, BJP, JDS, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, K G. Bopaiah, assembly speaker, speaker election, congress mlas, jds mlas, karnataka, politics

The BJP walked out of the Karnataka assembly minutes before the trust vote, throwing a dare at chief minister HD Kumaraswamy. "Let's see how long you last," said BS Yeddyurappa, as he staged a dramatic walkout from the House.

విశ్వాస పరీక్షకు ముందే బీజేపి ఇలా తప్పించుకుంది..

Posted: 05/25/2018 04:19 PM IST
Karnataka floor test bjp walks out during trust vote

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రభుత్వ ఏర్పాటు, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రలోభాలు.. అడియో టేపులు.. బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా.. కుమారస్వామి ప్రమాణస్వీకారం.. స్పీకర్ ఎన్నిక వరకు అన్ని అంశాల్లో తనదైన స్టాండును స్ట్రాటజీతో అవలంభిస్తున్న బీజేపి చివరకు కుమారస్వామి ప్రభుత్వ విశ్వాస పరీక్షను ఎదుర్కోన్న క్రమంలోనూ వినూత్న తరహా స్ట్రాటెజీని అవలంభించింది.

ఉదయం స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో చివరివరకు తమ అభ్యర్థి సురేష్ కుమార్ ను పోటీలో నిలపిన బీజేపి చివరాఖరున ఉపసంహరించుకుంది. దీంతో స్పీకర్ గా రమేష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రమారమి అదే స్ట్రాటజీని విశ్వాస పరీక్ష లోనూ అవలంబించింది బీజేపి. సరిగ్గా విశ్వాస పరీక్షకు అధికార పక్షానికి బలం వుందని నిరూపితం చేసేందుకు ముందే నాటకీయ పరిణామాల మధ్య వాకౌట్  చేసింది. అయితే వాకౌట్ చేసే ముందకు బీజేపి పక్ష నేత యడ్యూరప్ప చేసిన కీలక వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.

విశ్వాసపరీక్ష నేపథ్యంలో ప్రసంగించిన యడ్యూరప్ప.. తనకు కాంగ్రెస్ మీద ఎలాంటి కోపం లేదని, అయితే అవినీతి పరులైన దేవేగౌడ, కుమారస్వామీలపైనే తన అక్రోశమంతా అని అన్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు శివకుమార్ త్వరలోనే చింతిస్తారని జోస్యం చెప్పారు. ఇక వాకౌట్ చేసే క్రమంలో యడ్యూరప్ప తాను చేసిన నేరాలను అంగీకరించారు. తాను పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడింది నిజమని అంగీకరించారు.

అనైతిక కూటమి అధికారంలోకి ఎలా వస్తాయని తాను ఈ కూటమిని అధికారంలోకి రానీయకుండా అడ్డుకునేందుకే ఇలా చేశారని యడ్యూరప్ప అన్నారు. ఈ కూటమి పార్టీలు తమ స్వార్థం కోసం, అధికారం కోసం ఎంతస్థాయికైనా దిగజారుతాయని అన్నారు. తాను గతంలో కుమారస్వామితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఇప్పుడు భాధపడుతున్నానని అన్నారు. ఇక వెళ్తూ వెళ్తూ.. ఆయన కుమారస్వామికి సవాల్ విసిరారు. చూద్దం కుమారస్వామి మీరు ఎంతకాలం పదవిలో కొనసాగుతారో.? అంటూ వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trust vote  bjp  walkout  vidhana soudha  Kumara Swamy  SM krishna  Siddaramaiah  karnataka  politics  

Other Articles