Siddu welcomes Modi with tweets attack ప్రధాని మోడీ కర్ణాటకకు వెళ్తున్న వేళ.. షాకిస్తున్న సర్వే ఫలితాలు..!

As pm modi begins karnataka campaign siddaramaiahs tweet attack

Siddaramaiah, #AnswerMaadiModi, PM Modi, BS Yeddyurappa, Janardhan Reddy, Amit Shah, Rahul Gandhi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

PM Modi will begin his campaign today for the BJP in Karnataka for over five days, CM siddaramaiah gives shock to PM, with a series of sharp tweets on corruption charges linked to the BJP. presumptive chief minister BS Yeddyurappa and mining baron Janardhan Reddy,

ప్రధాని మోడీ కర్ణాటకకు వెళ్తున్న వేళ.. ట్వీట్లతో షాకిచ్చిన సిద్దూ..!

Posted: 05/01/2018 10:53 AM IST
As pm modi begins karnataka campaign siddaramaiahs tweet attack

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గోని రాష్ట్రం మొత్తం చుట్టి పరిస్థితును తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ప్రచార ఘట్టాన్ని క్రితం రోజుతో ముగించగా, ఇక నేటి నుంచి వరుసగా వారం రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ బాధ్యతలను తన భుజాలపైకి ఎత్తుకోనున్నారు. ఎనిమిదో తేదీ వరకూ పలు సభలు, రోడ్‌షోలలో మోదీ పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే కర్ణాటకకు చేరకున్న ప్రధాని మోడీ.. ఇవాళ ఉదయం 11 గంటలకు చామరాజనగర పట్టణంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు.

ప్రధాని నరేంద్రమోడీ ప్రచారపర్వం గురించి దేశప్రజలకు తెలుసు. ఇక ఆయన ప్రసంగాలు తటస్థ ఓటర్లను తమవైపుకు తిప్పుకునేలా వుంటాయన్న విషయం కూడా బాగా అర్థం చేసుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ప్రధానికి మనస్పూర్తిగా స్వాగతం పలుకుతూనే షాకిచ్చారు. ప్రధాని నిత్యం వల్లే వేసే అవినీతి విషయంలోనే ఆయనను టార్గెట్ చేస్తూ పలు విమర్శనాత్మక ట్వీట్లు పోస్టు చేసి.. తన ప్రశ్నలకు బదులివ్వాలని హ్యాస్ ట్యాగ్ తో #అన్సర్ మాది మోదీ అంటూ (#AnswerMaadiModi) కోరారు.

ఆయన ట్వీట్ల సారాంశం.. డియర్ నరేంద్రమోడీ, మా కర్ణాటకకు మీరు వస్తున్నారని తెలుసుకున్నాం. మీకు మా రాష్ట్రం తరపున ఘనస్వాగతం. మీకు ఇక్కడి రానున్న తరుణంలో మీకు కన్నడీగుల తరపున వున్న కొన్ని అంధోలన కలిగిస్తున్న ప్రశ్నలను అడగదలుచుకున్నాం.. వాటిని నివృత్తి చేస్తారని అశిస్తున్నాం.. మీ బహిరంగ సభల్లో గాలి జనార్థన్ రెడ్డి పాలుపంచుకుంటున్నారా.? గాలి జనార్థన్ రెడ్డి కుటుంభ సభ్యులకు, అతని మిత్రులకు మీరు 8 స్థానాల్లో పార్టీ టిక్కెట్లను కేటాయించారా..? అది మీ పార్టీకి పది నుంచి 15 స్థానాల్లో మేలు చేస్తుందని అశిస్తున్నారా.? అని ప్రశ్నించారు. ఇక ఇదేనా మీ అవినీతిపై ప్రసంగాల సారాంశమని నిలదీసారు. ఈ తరహా జిమ్మిక్కులను కన్నడీగులు నమ్మరని ఘాటు వ్యాఖ్యలు పేర్కోన్నారు.

ఇక బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుంభకోణాల్లో చిక్కుకున్న వ్యక్తి బిఎస్ యడ్యూరప్పను ప్రకటించడం సమంజసమేనా.? అని ప్రశ్నించిన సిద్దూ.. ఇక పత్రికలలో వస్తున్న వార్తలలో మాత్రం మీరు ఆయనతో కలసి డయాస్ పంచుకోరని, ఆయనతో కలసి ఏ ర్యాలీలలో పాల్గొనబోరని తెలుస్తుంది. ఇది నిజమేనా..? అయితే ఆయన.. మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థేనా కాదా.? దీనిపై స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా వుందని ఆయన తన ట్వీట్ల ద్వారా ప్రశ్నించారు.

ఇక కర్ణాటక రాష్ట్రంలో అత్యాచార కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తికి మీ పార్టీ టికెట్ ఎలా ఇచ్చింది.? అసెంబ్లీలో అశ్లీల వీడియో చూసిన ఎమ్మెల్యేకు కూడా మరోమారు టిక్కెట్ ఇచ్చింది.? ఇది మీకు సమంజసమేనా.? అంటూ ప్రశ్నించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో అత్యాచారం కేసులో చిక్కుకున్న ఎమ్మెల్యేను సీఎం ఆదిత్యనాథ్ రక్షణగా నిలుస్తారు..? జమ్మూకాశ్మీర్ లో అత్యాచార నిందితుల్ని మీ ఎమ్మెల్యే వెనకేసుకోస్తారు..? మీరు మాత్రం కర్ణాటకలో జరిగిన అత్యాచారంపై అదిరిపోయే విధంగా ప్రచారం చేస్తారా.? ఇదేనా మీ బేటీ బచావ్ నినాద స్పూర్తి అంటూ సిద్దరామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇక మరోవైపు కర్ణాటకలోని ఉత్తర, ధక్షిణ ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్ణాటక ప్రాంతంలోనూ ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ ప్రచారం చేయనున్నారు. కోస్టల్ కర్ణాటకలోని ప్రచారం చేయడంతో పాటు అక్కడున్న మఠాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు. ఇదివరకే సిద్దరామయ్య ప్రభుత్వాన్ని పది పర్సెంట్ ప్రభుత్వమని ప్రధాని విమర్శనాస్త్రాలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం  బెళగావి జిల్లా చిక్కోడిలో బెళగావి రెవెన్యూ విభాగ కార్యకర్తల సమావేశాల్లో ఉపన్యసిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  PM Modi  BS Yeddyurappa  Janardhan Reddy  Amit Shah  Rahul Gandhi  Congress  BJP  karnataka  politics  

Other Articles