Renuka Chowdary vows to return to Parliament పార్లమెంటుకు వెళ్లాలన్న పునర్ ప్రయత్నాల్లో రేణుకా

Renuka chowdary vows to return to parliament via lok sabha in 2019

Renuka Chowdary, Rajya Sabha, Loksabha, parliament, Telanagana, YSRCP, AP Special status, Ponguleti Srinivasa Reddy, andhra pradesh, politics

Former Union minister Renuka Chowdary, who is retiring as the Congress’ Rajya Sabha member on April 2, is preparing to contest from the Khammam Lok Sabha constituency in the next general election.

మళ్లీ పార్లమెంటుకు వెళ్లాలని రేణుకా చౌదరి ముమ్మరయత్నాలు

Posted: 03/31/2018 12:09 PM IST
Renuka chowdary vows to return to parliament via lok sabha in 2019

రానున్న2019 సార్వత్రిక ఎన్నికలలో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారో చెప్పకనే చెప్పేశారు కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి. ఏప్రిల్ 2న రాజ్యసభ సభ్యురాలిగా పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో దానికి విరమణ చేయనున్న ఆమె తాను రానున్న లోక్ సభ సాధారణ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమి చెందడం తనకు ఇంటర్వెల్ లాంటిదని రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు.

రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు చేపట్టిన ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి మద్ధతు ఇచ్చిన రేణుకాచౌదరి దీనిపై వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాను డిమాండు చేశానే తప్ప ఇక్కడ రాజకీయాలకు తావు లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని రేణుకాచౌదరి వివరించారు.

కాగా, 1999, 2004 ఎన్నికల్లో రేణుకాచౌదరి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, గత 2014 ఎన్నికల్లో వైస్సార్ సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలైన అమెను.. అధిష్టానం రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసి ఢిల్లీకి రప్పించుకుంది. కాగా అమె పదవీ కాలం ముగిసిపోవడంతో.. అమె రానున్న ఎన్నికలపై అప్పుడే దృష్టి సారించారు. తాను రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నా నిత్యం ఖమ్మం ప్రజలతో కలిసే ఉన్నానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles