RBI slaps Rs 58.9 crore fine on ICICI Bank ఐసీఐసీఐ బ్యాంకుకు వాత పెట్టిన ఆర్బీఐ.. రూ.59 కోట్ల జరిమానా..!

Rbi imposes rs 59 cr fine on icici bank for violating securities sale

RBI penalty on ICICI bank, RBI fine on ICICI bank, Held To Maturity (HTM), Mark to Market losses (MTM), Available for Sales (AFS), held for trading (HFT), HTM category, ICICI bond sale, Reserve Bank of India, Bond sale by ICICI bank, Bonds in HTM

The Reserve Bank of India, in a rare move, has imposed a penalty of Rs 58.9 crore on ICICI Bank, the country's biggest private bank and the third biggest overall, for failure to adhere to rules on sale of bonds in the held-to-maturity (HTM) category.

ఐసీఐసీఐ బ్యాంకుకు వాత పెట్టిన ఆర్బీఐ.. రూ.59 కోట్ల జరిమానా..!

Posted: 03/29/2018 01:47 PM IST
Rbi imposes rs 59 cr fine on icici bank for violating securities sale

ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం ICICI కు భారీ షాక్ తగిలింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో ICICI కు 59 కోట్ల భారీ జరిమానా విధించింది భారతీయ రిజర్వు బ్యాంకు. ఈ మేరకు మార్చి 26, 2018న ఆర్‌బీఐ ఒక నోటీసు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ లకు  ఆర్బీఐ జరిమానా విధించిన తరువాత తాజాగా ఐసీఐసీఐ బ్యాంకుకు కూడా ఈ జరిమానా పడింది.

సెక్యూరిటీ బాండ్ల ప్రత్యక్ష అమ్మకాల్లో నిబంధనలు పాటించని ఐసీఐసీఐ బ్యాంకుపై భారీ పెనాల్టీని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ తన హెచ్ఎంటీ పోర్ట్ పోలియో గురించిన పూర్తి వివరాలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రూ. 58.9 కోట్ల జరిమానా విధించారు. సెక్యూరిటీ బాండ్ల విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, బ్యాంకు ఈ నిబంధనలను పాటించలేదని వెల్లడించిందని ఇవాళ తెలిపింది.

ఈ జరిమానా కారణంగా లావాదేవీల వ్యాలిడిటీ, లేదా బ్యాంకు తమ కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్ 46 (4) (i) తో సెక్షన్ 47ఏ (1) (సి) లోని నిబంధనల ప్రకారం ఆర్‌ బీఐ జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండాలని తెలిపింది. వాటిని అతిక్రమంచినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంకుకు ఈ జరిమానాను విధిస్తున్నట్లు ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జోస్ కే ఖట్టూర్ ఈ నోటీసుల్లో వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICICI Bank  Banking  Business  RBI  Reserve Bank of India  HTM  securities  bonds  penalty  

Other Articles