Police assaulted by unknown persons పోలీసుపై యువకుల దాడి.. సీసీటీవీల్లో రికార్డు..

Police personnel allegedly assaulted by unknown persons

police assaulted, micreants assaulted police, patrolling personnel, chennai, kattupakkam, youth assault police in kattupakkam, police assaulted by youth in chennai, tamilnadu, crime

In a shocking incident, a Tamil Nadu police patrolling personnel was allegedly assaulted by unknown persons in Chennai’s Kattupakkam.

ITEMVIDEOS: పోలీసుపై యువకుల దాడి.. సీసీటీవీల్లో రికార్డు..

Posted: 03/29/2018 10:37 AM IST
Police personnel allegedly assaulted by unknown persons

పోలీసు ఈ పధం చెబితే నేరస్థుల గుండెల్లో గుబులు. వక్రమార్గం పడుతున్న యువత వెన్నులో వణుకు పుడుతుంది. తల్లిదండ్రులకు కూడా బయపడని యువత పోలీసుల పేరు చెబితే బయపడతారు. అయితే ఇందుకు భిన్నంగా చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పూట పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తోన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్ ను ఇద్దరు యువకులు వెంబడించి చావగొట్టారు. ఈ దాడికి సంబంధించిన దృష్యాలు అక్కడే ఏర్పాటు చేసిన సిసిటీవీ ఫూటేజీలో నిక్షిఫ్తం కావడం.. అవికాస్తా బయటకు రావడంతో..  ఆ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, చెన్నైలోని కట్టుపక్కం ప్రాంతంలో ఓ పోలీసును తరుముతూ కొందరు యువకులు వచ్చారు. చివరికి ఆ పోలీసుని పట్టుకుని పదునైన ఆయుధంతో కొట్టారు. అనంతరం వారి నుంచి తప్పించుకుని పారిపోతోన్న ఆ పోలీసును మళ్లీ వెంబడించి పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఆ పోలీసు కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గుర్తు తెలియని ఆ దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ దుండగులు ఈ దాడి ఎందుకు చేశారన్న విషయం గురించి సమాచారం అందాల్సి ఉంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police. assault  micreants  patrolling personnel  chennai  kattupakkam  tamilnadu  crime  

Other Articles