left parties alleges high drama betweem TDP and BJP కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హోదా డ్రామా: వామపక్షాలు

Left parties alleges high drama betweem tdp and bjp over special status

pawan kalyan, janasena, guntur, mangalagiri, cpm, madhu, cpi, rama krishna, left parties, special status. High drama, TDP BJP drama, Pawan Kalyan Political Yatra, andhra pradesh, politics

After plannig out a state wide protest starting from rayalaseema, uttarandhra and prakasham districts with Jana Sena chief Pawan Kalyan, left parties leaders Madhu and Rama Krishna alleges that state and union government are playing high drama over special status issue.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హోదా డ్రామా: వామపక్షాలు

Posted: 03/26/2018 03:24 PM IST
Left parties alleges high drama betweem tdp and bjp over special status

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం నిర్మించాలని జనసేన, సీఫీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయని సీపీఎం నేత మధు తెలిపారు. రాష్ట్రంలోని రైతాంగం, యువతీయువకులు, మేధావులు, ఉద్యోగులు, ఇలా ఒక్కరు కాకుండా అన్నివర్గాల ప్రజలను సమీకరించి పెద్దస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. మొదట రాయలసీమ నుంచి ఈ ఉద్యమం ప్రారంభమవుతుందని, ఆ తరువాత ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు కూడా చేరుతుందని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల అకాంక్ష నేపథ్యంలో ప్రత్యేకహోదా కోసం జరిగే తమ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో లెక్కలు పంపలేదని రాష్ట్రంపై కేంద్రం అక్షేపణలు వ్యక్తం చేసి నిధులను విధిల్చకుండా చేయడంపై స్పందించిన మధు, రాష్ట్రంలో రెండు గిరిజన యూనివర్శిటీల ఏర్పాటుకు బీజేపి నాలుగేళ్లు పూర్తికావస్తున్న పార్లమెంటులో చట్ట సవరణ చేయలేదని ఎద్దేవా చేశారు. 11 జాతీయ సంస్థలకు 421 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారని ఇక అమిత్ షా ఉత్తరం అంతా బుకాయింపు మాత్రమేనని దుయ్యబట్టారు. అటు కేంద్రంతో నాలుగేళ్ల పాటు సఖ్యతగా వ్యవహరించిన చంద్రబాబు.. ఇన్నాళ్ల పాటు ప్రజలకు ఏ విషయాలను వెలువరించకుండా.. అన్ని విషయాలను దాచుకుని ఇప్పుడు ఎన్నికలకు ముందుమాత్రం దొంగఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. టీడీపీ-బీజేపీ లు ఏపీ ప్రయోజనాలను విస్మరించాయని అందుకనే వాటికి దూరంగా తాము ఉద్యమాల బాట పడుతున్నామని చెప్పారు.

అనంతరం సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని, ఏప్రిల్ నెలలో మొదటి సమావేశం అనంతపురంలో నిర్వహిస్తామని చెప్పారు. కొత్త రాజకీయ వేదిక కావాలని నవతరం యువత కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల కోసం పనిచేసి.. ప్రజల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లామని, ఐదు కోట్ల అంధ్రులు ఆకాంక్ష ప్రత్యేక హోదాను సాధించే వరకు తమ ఉద్యమం అగదని అన్నారు. ఈ భాద్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వున్నా అవి వాటిని పూర్తిగా విస్మరించాయని దుయ్యబట్టారు.

నాలుగేళ్లుగా కేంద్రానికి వంతపాడిన టీడీపీ ఇప్పుడు కేంద్రంతో పోరాడుతున్నట్లుగా కొత్త డ్రామాను రక్తి కట్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వంతో రాష్ట్ర అధికార, విపక్ష పార్టీలు లాలూచీ పడ్డాయని ఆయన అరోపించారు. అందుకనే తాము ఇటు తమతో కలసివచ్చే రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, ఉధ్యోగులు, యువత, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఉద్యమాన్ని నిర్మించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా, ఈ నెల 27న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా పాటిస్తామని, ఈ నెల 29న విద్యార్థి జేఏసీ ఏర్పడుతుందని రామకృష్ణ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  cpm  madhu  cpi  rama krishna  special status  andhra pradesh  politics  

Other Articles