PM Modi Serious on Statues Demolish in India | కొనసాగుతున్న ప్రముఖుల విగ్రహాల ధ్వంసం.. ప్రధాని సీరియస్

Great personalities statues demolished in india

Statues Demolished, Tamil Nadu, BJP Leaders, Lenin, Periyar, Periyar Ramaswamy, SP Mukherjee Statue, Vandalism

More statues targeted after Lenin's: In TN, Periyar's statue stoned; in Kolkata SP Mukherjee's statue vandalised. Prime Minister Modi Serious on this issue and Instruct States to take Strict actions Against those culprits.

కొనసాగుతున్న విధ్వంస పర్వం.. ప్రధాని సీరియస్

Posted: 03/07/2018 10:51 AM IST
Great personalities statues demolished in india

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విగ్రహాల విధ్వంసపర్వం కొనసాగుతోంది. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కమ్యూనిస్టు యోధుడు లెనిన్ విగ్రహాన్ని బుల్డోజరుతో ధ్వంసం చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, తమిళనాడులో ఉగ్రవాది రామస్వామి విగ్రహాలను ధ్వంసం చేస్తామని బీజేపీ నేత హెచ్ రాజా తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనాన్నే కలిగించింది.

ఇదిలా ఉంటే గత రాత్రి తమిళనాడు వాసులు తమ నేతగా కొలుచుకునే పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిత్యమూ బిజీగా ఉండే కాళీ ఘాట్ ప్రాంతంలో ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని కూల్చి వేశారు. వరుసగా జరుగుతున్న ఈ విధ్వంసపర్వాలపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు.

ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ అధికారులతో చర్చించారు. విగ్రహాల కూల్చివేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారని, నిందితులు ఎవరైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రిత్వ శాఖ అధికారులు సూచించారు. ఈ తరహా దాడులు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని ప్రధాని అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని హోంశాఖ ప్రతినిధులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles