Centre Likely to Extend Aadhar Linkage Process | ఆధార్ ఇంకా అనుసంధానం చేయలేదా?.. అయినా ఫర్వాలేదు

Good news for aadhar link

Aadhaar Linkage, Dead Line, Extend, March 31st, Supreme Court, Central Government, Aadhar Case

The deadline for mandatory linking of Aadhaar to avail various services and welfare schemes run by the government may be further extended beyond March 31, the Centre indicated in the Supreme Court on Tuesday. The Centre said that since some more time would be needed to conclude the prolonged hearing in the Aadhaar case.

ఆధార్ అనుసంధానంపై గుడ్ న్యూస్

Posted: 03/07/2018 11:05 AM IST
Good news for aadhar link

సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు కేంద్రం తుది గడువును విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో గుడ్ న్యూస్ అందబోతోంది. ఆ తుది గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించే అవకాశముంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

"గతంలో ఆధార్ అనుసంధానం తుది గడువును మేము పొడిగించాం. దీనిని మళ్లీ పొడిగిస్తాం. కానీ, ఆధార్ కేసులో పిటిషనర్ల వాదోపవాదాలు ముగిసిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటాం"అని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆధార్ కేసు విషయంలో తుది తీర్పు రావడానికి మరింత సమయం పట్టే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ దిశగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చేసిన వాదనతో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. అయితే అది ఎప్పటి దాకా అన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయింది.

ఇక అటార్నీ జనరల్ తాజా ప్రకటనతో ఇప్పటివరకు ఆధార్‌ను లింకు చేయని వారికి మళ్లీ అవకాశం లభించినట్లయింది. కాగా, గతేడాది డిసెంబరు 15న ఆధార్ తుది గడువును ఈ మార్చి 31 దాకా విధించిన విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles