YS Jagan Face Protest from MRPS in Padayatra | జగన్ పాదయాత్రకు తొలి అడ్డంకి.. అడ్డుకున్న ఎమ్మార్పీఎస్

Protest to ys jagan padayatra prakasam

YS Jagan Mohan Reddy, Praja Sankalpa Yatra, MRPS, SC Classification, Padayatra, Prakasam

First Protest to Praja Sankalpa Yatra. MRPS Workers Stop YS Jagan Mohan Reddy Padayatra in Prakasam District. They Demand Jagan Assurance on SC Categorisation. Later YSRCP Leaders Convey them and Yatra Begins.

నిరసన.. జగన్ పాదయాత్రకు ఫస్ట్ బ్రేక్

Posted: 02/21/2018 12:24 PM IST
Protest to ys jagan padayatra prakasam

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ అవినీతిని ఎండగడుతూ... ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఆయన యాత్ర కొనసాగుతోంది. నేడు యాత్ర 94 రోజుకి చేరుకోగా.. నిరసనలతో యాత్రకు కాసేపు బ్రేక్ పడింది.

పొన్నలూరు మండలం అగ్రహారానికి జగన్ చేరుకున్న వేళ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని, దీనిపై స్పష్టమైన ప్రకటన జగన్ నోటి నుంచి వచ్చేంత వరకూ తాము యాత్రను సాగనివ్వబోమని చెబుతూ, పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అడ్డుకున్న జగన్ వ్యక్తిగత సిబ్బంది, స్థానిక పోలీసులు వారిని చెదరగొట్టారు.

చివరకు వైకాపా నేతలు జోక్యం చేసుకుని.. ఈ విషయంలో జగన్ తప్పకుండా స్పందిస్తారని, యాత్రను అడ్డుకోవడం సబబు కాదని, అది తప్పుడు సంకేతాలు పంపుతుందని సర్దిచెప్పటంతో యాత్ర ముందుకు కొనసాగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles