Gurugram Student threatens to Rape Teacher | ఒకడేమో ‘రేప్’ వార్నింగ్.. మరొకడు సెక్స్ చేద్దామంటూ మెయిల్

Teacher rape threaten by student

Gurugram, Student, Rape Threat, Teacher, Obscene Mail, Student Rape Threat

A Class VII student of a well-known Gurugram school threatened to rape his teacher and her daughter in an online post. The daughter studies with him in the same class. In another incident, a Class VIII student of the same school sent a mail to a teacher, asking her out for a candlelight date and sex. Both the incidents happened last week. The teacher, threatened with rape, has since returned to school but her daughter is still too traumatised to get back.

జాగ్రత్త టీచర్.. మిమల్ని రేప్ చేస్తా!

Posted: 02/21/2018 02:28 PM IST
Teacher rape threaten by student

విద్యాబుద్ధులు నేర్పే గురువుకి ఎవరూ ఊహించని వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ ఓ విద్యార్థి. మందలించినందుకుగానూ టీచర్ ను, ఆమె కూతురిని కూడా అత్యాచారం చేస్తానంటూ ఆన్ లైన్ లో బెదిరింపులకు దిగాడు. గురుగ్రామ్ లోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఓ ప్రైవేట్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సరిగ్గా చదవకపోవటంతో టీచర్ మందలించారు. ఇది మనసులో పెట్టుకుని అతగాడు ఆన్ లైన్ మాధ్యమంలో బెదిరింపులకు దిగాడు. ‘నిన్ను, నీ కూతురిని రేప్ చేస్తాను’ అంటూ మెయిల్ పంపించాడు. దీంతో అదే స్కూల్ లో చదువుతున్న ఆమె కూతురు స్కూల్ మానేయగా.. స్కూల్ యాజమాన్యానికి ఆ టీచర్ కంప్లయింట్ చేసింది. ఇక అదే పాఠశాలలో ఎనిమిదో క్లాస్ చదువుతున్న మరో విద్యార్థి టీచర్ కు అసభ్యకర ఈ-మెయిల్ పంపాడు.

తనతో శృంగారంలో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం పంపాడు. ఈ రెండు ఘటనల్లో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను సస్పెండ్ చేసి కౌన్సెలింగ్ కు పంపింది. విద్యార్థులు మైనర్లు కావడంతో వారి పేర్లతో పాటు, పాఠశాల పేరును వెల్లడించేందుకూ అధికారులు నిరాకరించారు. బాలల హక్కుల సంఘం ఈ ఘటనకు సీరియస్ గా తీసుకుని పాఠశాలకు నోటీసులు పంపింది. టీచర్లు, విద్యార్థులు తమ ఎదుట హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరో పక్కన పిల్లల ఆన్ లైన్ వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచాలని మానసిక వైద్యులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles