10th pass mandatory for sarpanch candidates సర్పంచ్ కావాలంటే ఇక పది పాస్ తప్పనిసరి..

Telangana govt to bring new act for surpanch candidates

panchayat elections, mandatory, 10th pass, sarpanch, men, women, dalits, minorities, educational qualification, law, misuse of funds,‪ Telangana news, news updates, latest updates, latest news, news online

The Telangana government planning to bring a law mandates that the minimum education qualification that to contest in the panchayat polls is class 10 pass for both men and women.

సర్పంచ్ కావాలంటే ఇక పది పాస్ తప్పనిసరి..

Posted: 02/16/2018 12:43 PM IST
Telangana govt to bring new act for surpanch candidates

గ్రామపంచాయితీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలను కూడా పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తోందా..? అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి. వార్డు సభ్యుల నుంచి సర్పంచుల వరకు గ్రామ పంచాయితీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హతలు వుండాలని కూడా కొత్త నిబంధలను తీసుకురానుంది. మరీ ముఖ్యంగా గ్రామపంచాయితీ ఎన్నికకు పదవ తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేయాలని కూడా నిర్ణయం తీసుకోనుంది.

ప్రస్తుతం గ్రామ సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఏలాంటి విద్యార్హతలు అవసరం లేదు. అయితే ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని తెలంగాణ లోని అనేకమంది చదువురాని సర్పంచులను బరిలో నిలిపి.. నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న అభియోగాలు వస్తున్నాయి. అయితే అన్నింటికీ సర్పంచులనే బాధ్యుతను చేస్తున్నా.. నిధుల గోల్ మాల్ కు సంబంధించిన అంశాల్లో అసలు వారి ప్రమేయం ఏమీ లేదన్నది అనక తెలుతున్న వాస్తవం. దీంతో కనీస విద్యార్హతలను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.

రాష్ట్రంలో 80 శాతానికి పైగా సర్పంచులు నిరక్షరాశ్యులే ఉన్నారు. వారి తరుపునా వారి కుటుంబ సభ్యులో, లేక ఇతరులో పంచాయతీల వ్యవహారాలు చూస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిధులు లేమితో అభివృద్ది కూడా కుంటుపడుతుంది. పల్లె ప్రగతికి ఇవి అవరోదాలుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొంది.

మరో మూడు నాలుగు మాసాల్లో రానున్న గ్రామ పంచాయితీల ఎన్నికల్లో ఈ ప్రతిపాదనలను అమలు చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటీకే పంజాబ్, హర్యాన రాష్ట్రాల్లో సర్పంచ్ ఎన్నికలకు కనీస విద్యార్హత 10వ తరగతిని అమలు చేస్తున్నారు. శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యులకు పోటీ చేయడానికి కనీస విద్యార్హత కూడా లేదు. ఎమ్మెల్యే, ఎంపీలకు పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధన కూడా లేదు. కానీ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే కూడా గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడానికి వీలులేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles