Railway Police Overaction at Gooty Railway Station పోలీస్ జులుం: అకారణంగా యువకుడిపై లాఠీ దెబ్బ..

Rpf police unnecessary thrashes passenger viral on social media

rpf police thrashes passenger, railway police thrashed passenger, rpf police overaction, railway police overaction, rpf police, railway police force, gooty railway station, sleeper class, general ticket, bangalire-kachiguda express train, anatapur, andhra pradesh, social media, viral video

RPF police unnecessary thrashes passenger, who was rushing into sleeper class with general ticket at gooty railway station in anantapur district, the video is viral on social media

ITEMVIDEOS: పోలీస్ జులుం: అకారణంగా యువకుడిపై లాఠీ దెబ్బ..

Posted: 02/15/2018 12:57 PM IST
Rpf police unnecessary thrashes passenger viral on social media

ప్రయాణికులకు తమ ప్రయాణంలో ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, వ్యవహరించాల్సిన రైల్వే పోలీసులు.. తాము సివిల్ పోలీసులకు ఏ మాత్రం తక్కువ కాదన్న రీతిలో వ్యవహరించి.. అకారణంగా ఓ యువకుడికి లాఠీల దెబ్బల రుచి చూపించారు. రైలు ప్రయాణంలో ఓ ఆర్పీఎఫ్ పోలీసు తన ప్రాణాలకు తెగించి.. తన తల్లితో వచ్చి రైలు ఎక్కబోతూ పట్టుతప్పి పట్టాలపై పడబోతున్న ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడిన ఘటన ఇటీవలే ముంబైలో వెలుగుచూసింది. అయితే ఇలాంటి ఘటనలు ఎంతగా రైల్వే పోలీసులపై ప్రశంసలను కురిపించాయో.. అంతకన్నా ఎక్కువ విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి.

పోలీసులు అకారణంగా ఓ యువ ప్రయాణికుడిపై లాఠీని జుళిపిస్తున్న క్రమంలో అదే రైల్వే స్టేషన్లో వున్న ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో పోలీసుల ఓవర్ యాక్షన్ వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. బెంగుళూరు-కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలులో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. అసలు రైల్వే పోలీసుల యువకుడిపై దాడి చేయడానికి కారణాలు ఏంటి.? అన్న ప్రశ్నలు మీ మదిలో తిరుగుతున్నాయా..?

వివరాల్లోకి వెళ్తే.. గుత్తి రైల్వే స్టేషన్‌లో సురేష్‌ అనే ప్రయాణికుడు జనరల్‌ టిక్కెట్ తీసుకుని రైలు కదులుతుందేమోనన్న అందోళనలో స్లీపర్‌ కోచ్‌ ఎక్కబోయాడు. అదే బోగిలో వున్న రైల్వే పోలీసులు దీనిని గమనించి అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తాను ఎందుకు స్లీపర్ క్లాస్ లో ఎక్కేందుకు ప్రయత్నించానో చెబుతున్న సురేష్ మాటలను కూడా అసలు వినకుండా, చితకబాదాడు. ప్రయాణికుడు చెబుతున్న మాటలను కూడా వినిపించుకోకుండా అలానే దాడి చేయడమేంటని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు. బాధితుడు సురేష్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. అకారణంగా తనను రైల్వే పోలీసులు కొట్టారని తన బాధను వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles