Over 5 lakh UP Board students give exams a miss | నిఘా నేత్రం నీడలో పరీక్షలంటే.. 5 లక్షల మంది డుమ్మా..

Over 5 lakh up board students give exams a miss after govt installs cctv cameras

up board exams, uttar pradesh board examinations, up board exams 2018, up class 10 exam, up class 12 exam, up board, yogi adityanath government, education, up board, yogi adityanath, 10th, 12th, borad exam, 5 lakh students leave exam, up board exams, uttar pradesh board examinations, up board exams 2018, up class 10 exam, up class 12 exam, up board, yogi adityanath government, education, up board examination, up 10 board exam dates, up 12 board examination dates, up board exam rules, cctv, up cctv, up students, up board exam centers, board exam centers, up board exam dates, up news, education news

The officials have claimed the number of absentees is high following the strict measures initiated by the Yogi Adityanath-led government to check copying in the exams.

నిఘా నేత్రం నీడలో పరీక్షలంటే.. 5 లక్షల మంది డుమ్మా

Posted: 02/09/2018 02:34 PM IST
Over 5 lakh up board students give exams a miss after govt installs cctv cameras

పరీక్షలంటే ఓ కొలమానం. అందులో ఉత్తీర్ణలు అయితేనే విద్యార్ధులు అపై చదువులకు అర్హత సాధిస్తారు. ఇలాంటి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేందుకు విద్యార్థులు ఎంతో కష్టపడతారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పిందే కాకుండా సాయంత్రం వేళ ట్యూషన్లు వెళ్లి మరీ నేర్చేసుకుంటారు. ఇక మరికొందరు మాత్రం ఏకంగా పరీక్షలు సమీపించిన సమయాల్లో రాత్రింబవళ్లు చదువులకే పరిమితం అవుతారు. తొమ్మిదినెలలు కష్టపడింది ఇందోకోసమేనంటూ అరోగ్యం సరిగా లేకున్నా పరీక్షలకు హాజరవుతారు.

అయితే సందెంట్లో సడేమియాలు మాత్రం ఇవేమి పట్టకుండా పరీక్షల్లో ఎలా పాస్ కావాలన్న దానిపైన మాత్రమే ద్యాసపెడతారు. అంటే కాపీయింగ్ అన్నమాట. కుదిరితే మాస్ కాపియింగ్ లేదంటే సెల్ప్ కాపీయింగ్. అయితే ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా విమర్శలను ఎదుర్కొవా్లసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో కాపీయింగ్ కేటగాళ్ల అటలు సాగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ విద్యాశాఖాధికారుల తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తొలి రెండు పరీక్షలకు డుమ్మాకొట్టారంటే ఆ వ్యూహం వారికి ఎంతగా షాకిచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వాటిని అమలు పరిచారా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు.

అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఆయన పర్యటనలో భాగంగా సిసీ కెమెరాల ఏర్పాటన్లను కూడా పరిశీలించారు. ఇక పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాసే గదుల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చడంతో.. కాఫీకొట్టడానికి నిఘానేత్రాలు అడ్డుగా మారాయి. దీంతో విద్యార్ధులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తంగా పది, ఇంటర్ పరీక్షలకు 66 లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి వుండగా, వారిలో ఐదు లక్ష్లల మంది గైర్హాజరయ్యారు. ఇక మరిన్నీ పరీక్షలు మిగిలివుండటంతో మరెందరో విద్యార్థులు కూడా గైర్హాజరు కావచ్చునని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles