Pawan Kalyan meets JP about AP special status జేఏసీ వైపు శరవేగంగా అడుగులు..జేపీతో పవన్ భేటీ

Pawan kalyan meets jaya prakash narayan on ap special status

Undavalli Arun Kumar, Jaya Prakash Narayan, JAC, Pawan Kalyan Press meet, Pawan Kalyan Union budger, Pawan Kalyan special package, pawan kalyan special status, pawan kalyan janasena, pawan kalyan, union budget, chandrababu, BJP, TDP, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star Pawan Kalyan meets loksatta president Jaya Prakash Narayan and discussing on how to get special status to andhra pradesh

ITEMVIDEOS: జేఏసీ వైపు శరవేగంగా అడుగులు..జేపీతో పవన్ భేటీ

Posted: 02/08/2018 03:19 PM IST
Pawan kalyan meets jaya prakash narayan on ap special status

రాష్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరముందని ఇటీవలే ప్రకటించిన జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఉండవల్లి అరున్ కుమార్, జయప్రకాష్ నారాయణ వంటి అనుభవజ్ఞులైన రాజకీయ నేతలతో ఐక్యవేదిక ద్వారా ఉద్యమిస్తానన్న పవన్.. కొద్ది సేపటి క్రితం లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను కలిశారు.

వారిద్దరూ ఏపీ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధులు, రాష్ట్ర సమగ్రాభివృద్ది సహా పలు అంశాలపై భేటీలో భాగంగా చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడంలో భాగంగా చేయాల్సిన ప్రయత్నాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే జేపీని కలసిన తరువాత ఈ నెల 11న ఉండవల్లి అరుణ్ కుమార్ తోనూ పవన్ భేటీ కానున్నారు. పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రకటనను అమలు ఎలా చేయించుకోవాలని, దానిన అచరణ సాధ్యం చేయడానికి ఎలా ముందుకెళ్లాలన్న విషయాలపై వీరితో చర్చించనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles