No changes in it rates, LTCG tax crashes stock market వేతనజీవి కనరాని ఊరట.. ఎల్టీసీజీ పన్నుతో స్టాక్ మార్కెట్ల క్రాష్..

No changes in income tax rates fm introduces 10 ltcg tax

arun jaitley, budget, sensex budget, nifty budget, income tax, sensex, nifty, mobile phones, ciggerte ligher, sun glasses, petrol, dissel, smart watches, olive oil, video games, cashew, tooth pase, health, budget 2018, budget tax slab, budget corporate tax, budget 7th pay commission, health budget, education, education budget, budget education, income tax, lok sabha, Narendra Modi, parliament, rajya sabha, Union Budget, Union Budget 2018, Union Budget 2018-19

Sensex, Nifty took a hit after FM announced a 10 percent tax on some long-term capital gains. There were no changes announced on personal income tax rates.

వేతనజీవి కనరాని ఊరట.. ఎల్టీసీజీ పన్నుతో స్టాక్ మార్కెట్ల క్రాష్..

Posted: 02/01/2018 03:53 PM IST
No changes in income tax rates fm introduces 10 ltcg tax

పార్లమెంటులో ఐదోసారి కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ వేతన జీవులకు మాత్రం ఊరట కల్పించలేదు. తమ వ్యక్తిగత అదాయపన్నులో కొంతమేరకైనా ఊరటను కల్పిస్తారని అశించిన వేతనజీవులపై మోడీ ప్రభుత్వం కరుణను ప్రసరించలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. వేతన జీవుల పట్లు ఎలాంటి ఊరట కలిగించలేదు. ఏడాదికి రెండున్నర లక్షల లోపు వేతనాన్ని అర్జించేవారి సంఖ్యకు యూపీఏ ప్రభుత్వంలో లభించిన ఊరట మాత్రమే కొనసాగుతుంది. వీరు ఎలాంటి పన్నులు చెల్లించే అవసరం లేదు.

అయితే కాస్తో కూస్తో రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకు అర్జిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే వుండగా, వీరికి మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. ఎన్నికల ముందు ఏడాది కావడంతో ఇప్పుడైనా కేంద్రం తమను కరుణిస్తుందని వేయి కళ్లతో ఎదురుచూసిన వేతన జీవులు అశలు గల్లంతయ్యాయి. నోట్ల రద్దు, జీఎస్టీ తరువాత పన్నులు 50శాతం మేర పెరిగయని, పన్నులు కట్టే వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పిన కేంద్రం.. పన్ను చెల్లింపుదారులలో ప్రథమార్థులుగా వున్న వేతన జీవులకు మాత్రం వాటి ఫలాలను అందించడంలో తాత్సారం చేస్తుంది.

2017-18 అర్థిక సంవత్సరానికి గాను రూ.21.54 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం.. 3.3 శాతం మేర ద్రవ్యలోటును అంచనా వేసింది. దీంతో పూర్తి అంచనా రూ.21.57 లక్షల కోట్లుగా పేర్కొంది. ఈ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలను పెంచిన కేంద్రం.. పనిలో పనిగా ఎంపీల వేతనాలను కూడా పెంచేసింది. ప్రజాప్రతినిధులుగా, ప్రజలకు సేవకులమని చెప్పుకునే నేతలు.. ప్రజల బాగోగులను మర్చి ప్రతీ ఐదేళ్లకోసారి పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అనుగూణంగా తమ వేతనాలను పెంచుకునే వెసలు బాటును కూడా కల్పించుకోవడంపై వేతన జీవలులు మండిపడుతున్నారు.

ఇక ఇదే క్రమంలో స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే లాభాలపై కూడా కేంద్రం పన్నుపోటును విధించింది. దానికి ఎల్టీసీజీ పన్నుగా కూడా నామకరణం చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లలో మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ సహా ఇతరాత్ర దీర్ఘకాలిక పెట్టుబుడల నుంచి లాభాలను అర్జించడంపై కూడా ఇకపై పన్నుపోటు పడనుంది. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రకటనను వెలువరించగానే స్టాక్ మార్కెట్లు తిరోగమనం బాటపట్టాయి. అంతే అయన ప్రకటన చేసిన క్షణాల్లో మార్కెట్లు ఏకంగా 300 పాయింట్ల లాభాన్ని కోల్పోయాయి.

వ్యక్తిగత అదాయపు పన్నులో కీలకాంశాలు ఇవే:

* బ్లాక్ మనీపై చేస్తున్న పోరాటం సత్ఫలితాలను ఇస్తోంది.
* 2016-17లో పన్ను చెల్లింపుదారులు 19.25 లక్షల మంది పెరిగారు.
* 8.72 కోట్లకు చేరుకున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
* గత రెండేళ్లలో భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.
* 40 శాతం పెరిగిన రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య.
* మారని వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితులు.
* కొనసాగనున్న ప్రస్తుత శ్లాబ్ విధానం.
* వేతనజీవులకు ప్రయాణ, వైద్య ఖర్చులపై రూ. 40 వేల వరకూ పన్ను రాయితీ.
* సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు మరింత అదనపు రాయితీ.
* వయో వృద్ధులకు అదనపు రాయితీ రూ. 60 వేల నుంచి రూ. లక్షకు పెంపు.
* వయోవృద్ధుల డిపాజిట్లపై రూ. 50 వేల వరకూ టీడీఎస్ రద్దు.
* తీవ్ర అనారోగ్యాల బారిన పడ్డ సీనియర్ సిటిజన్లకు ఇల్ నెస్ డిడక్షన్ రూ. 50 వేలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  Union Budget 2018  income tax  sensex  nifty  Narendra Modi  parliament  

Other Articles