woman cheats youth in the pretest of marriage మ్యాట్రిమోనీలో కి‘లేడీ’ యువకులను శఠగోపం

Fraud woman cheats youth in the pretest of marriage through matrimony site

deepthi, fraud women, cheating, youth, marriage, matrimony sites, penamaluru, vijayawada, hyderabad, crime

A fraud woman cheats youth in the pretest of marriage through matrimony sites in vijayawada. police said she made similar crime in the past in penamaluru and hyderabad.

ఫోటోలతో బురిడీ.. మ్యాట్రిమోనీలో మాయలాడి

Posted: 01/25/2018 12:59 PM IST
Fraud woman cheats youth in the pretest of marriage through matrimony site

యువకులను చూపు తిప్పనీయకుండా మంచి హోయలతో దిగిన ఫోటోను మ్యాట్రిమోనీ సైట్లలో పెట్టి.. రెప్ప వాల్చకుండా చేయడమే కాకుండా.. మన్సును దోచే మాటలతో చదవాలనిపించే ప్రొఫైల్‌ పోస్టు చేసింది. ఇది చూసిన అబ్బా చేసుకుంటూ ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపించేలా అశలు రేపింది. ఎంతటి నేరసామ్రాజ్య ఘణాపాటీలైన ఎక్కడో ఒక్క చోట తప్పలు చేస్తారు. అలాంటి తప్పునే ఈ మాయలాడి చేయడంతో అమె వలలో చిక్కిన అమాయక యువకుల సంఖ్య తేల్చే పనిలో వున్నారు పోలీసులు.

మ్యాట్రిమోనిలో నకిలీ ప్రొఫైల్‌తో యువకులకు ఎరవేసి, వాళ్ల నుంచి లాగేసిన డబ్బులతో విలాసవంతంగా జీవించడాన్ని అలవాటుగా మార్చుకొంది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న విజయవాడకు చెందిన ధరణీకుమార్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ధరణీకుమార్‌ తన బయోడేటాను మ్యాట్రిమోని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయగా, అదే సైట్ లో దీప్తి తన ప్రొఫైల్ ను ఉంచింది. కాకపోతే, తన ఫొటోకు బదులు ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టింది. అసలు పేరుకు బదులు సాయి ధన్య భీమనేని అని పేర్కొంది.
 
ఆ ప్రొఫైల్‌ నచ్చి, ఆమె పరిచయంలోకి ధరణీకుమార్‌ వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. క్రమంగా అతని నుంచి రూ.1.99 లక్షలను లాగేసింది. ఆ తరువాత నుంచి ఆమె ధరణీకుమార్ తో సంబంధాలకు ఫుల్ స్టాఫ్‌ పెట్టింది. తాను మోసపోయినట్టు ఆలస్యంగా తెలుసుకున్న ఆయన, ఫోర్త్‌ లయన్‌ యాప్ లో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. హెచ్ డ ఎ్‌ సీ బ్యాంక్ ఖాతా ఆధారంగా ఆమెను పట్టుకొన్నారు. దీప్తి ఇంతకుముందు మరో ఇద్దరిని ఇలాగే మోసం చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెపై పెనమలూరు, హైదరాబాద్ లోనూ కేసులు ఉన్నాయంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepthi  fraud women  cheating  youth  marriage  matrimony sites  penamaluru  vijayawada  hyderabad  crime  

Other Articles