One rupee sari in bidar, local women queue up miles రూపాయికే చీర.. పక్షం రోజుల పాటు మహిళలకు అఫర్

One rupee sari kumaraswamy s fan puts up five lac on sale

Chandrashekhar Pasarge, Janata Dal, Kumara swamy, one ruppee sari, 'Srushti - Drushti' Sari Centre, voter id card, tirumala triupathi devasthanam, venkateshwara swamy, chief minister, bidar, karnaktaka

Chandrashekhar Pasarge, who owns 'Srushti - Drushti' Sari Centre in the town has now been selling five lac saris at one rupee per piece

రూపాయికే చీర.. పక్షం రోజుల పాటు మహిళలకు అఫర్

Posted: 01/22/2018 09:27 AM IST
One rupee sari kumaraswamy s fan puts up five lac on sale

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఎదో ఒక జిమ్మిక్కుతో ప్రజలను అకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి దేశ ప్రజలక ఖాతాలలో వేస్తామని, ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రాలలో కూడా అనేక పార్టీలు ఇలా అచరణ సాధ్యం కాని హామీలతో పాటు.. అచరించే హామీలను కూడా గుప్పించడం.. ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడం పరిపాటిగా వస్తుంది.

ఇదే క్రమంలో త్వరలో ఎన్నికలకు సన్నధమవుతున్న కర్ణాటకలో ఓ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలని అలోచించాడో.. లేక పార్టీ తరపున తనవారికి టిక్కట్ లభించాలనె అదికాకపోతే టిక్కెట్ వచ్చినా తమవారు గెలవాలని చేశాడో తెలియదు కానీ.. ఓ వ్యాపారవేత్త ఒక్కసారిగా స్థానిక మహిళలను అకర్షించేందుకు రెడీ అయ్యారు. అదెలా అంటే.. తిరుమల వెంకటేశ్వరస్వామి కలలో దర్శనమిచ్చి చెప్పారంటూ, 5 లక్షల చీరలను ఒక్కొక్కటీ రూపాయికే అమ్మడాన్ని ప్రారంభించాడు.

వివరాల్లోకి వెళ్తే, బీదర్ లోని ఓ వస్త్రదుకాణం యజమాని చంద్రశేఖర్, జేడీఎస్ పార్టీ వీరాభిమాని.ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించి, తమ నేత కుమారస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది ఆయన కోరిక. కొద్ది రోజుల క్రితం వెంకన్న కలలోకి వచ్చి, కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే, 5 లక్షల చీరలను పంచాలని చెప్పాడట. దీంతో కేవలం ఒక్క రూపాయికే చీరను విక్రయించాలని నిర్ణయించానని, 15 రోజుల పాటు మాత్రమే ఈ విధంగా చీరలను విక్రయిస్తామని ప్రచారం చేయడంతో ఆయన దుకాణం ముందు కీలోమీటర్ల దూరం పోడవునా మహిళలు బారులు తీరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrashekhar Pasarge  Janata Dal  Kumara swamy  one ruppee sari  bidar  karnaktaka  

Other Articles