Congress lashes out at Governor Comments on Kaleshwaram | అంత ఆసక్తి ఉంటే టీఆర్ ఎస్ లో చేరండి.. భజన శాఖ ఇస్తారేమో!

T congress fire on governor

Telangana, Congress Party, Governor Narasimhan, KCR, Bhajana Ministry, Governor Praise KCR, Kaleshwaram Project, Chandrasekhar Kaleshwar Rao Mark

Telangana Congress Party Angry on Governor Narasimhan Prasis CM KCR and Harish Rao during Kaleshwaram Project Visit. Leaders suggest Narasimhan to join in TRS and get Bhajana Ministry.

గవర్నర్ పై టీ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

Posted: 01/21/2018 03:01 PM IST
T congress fire on governor

కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతమంటూ గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖరరావుగా, మంత్రి హరీష్ రావును కాళేశ్వర్ రావుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది.

రాజ్యాంగాన్ని, రాజ్ భవన్ ను నరసింహన్ అవమానిస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. నరసింహన్ వ్యవహారశైలితో గవర్నర్ వ్యవస్థకే అపకీర్తి వస్తోందని విమర్శించారు. కాళేశ్వరంపై గవర్నర్ తీరు విచిత్రంగా ఉందని అన్నారు. కేసీఆర్, హరీష్ ల పేర్లు మాత్రమే మార్చినందుకు సంతోషంగా ఉందని... మరిచిపోయి రాజ్ భవన్ పేరును కూడా టీఆర్ఎస్ భవన్ గా మార్చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్పుపై ఎందుకు ప్రశ్నించలేదని భట్టి అన్నారు. రూ. 20 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు బడ్జెట్ ఎందుకు పెరిగిందో ప్రశ్నించారా? అని మండిపడ్డారు. ఆహా, ఓహో అంటూ పొగిడేముందు... ఆ ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

టీఆర్ ఎస్ భజన ఎక్కువైంది...

టీఆర్ఎస్ కు గవర్నర్ నరసింహన్ భజన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం ఉందని, ఇకపై అవినీతి కేసులో గవర్నర్ నూ విచారించాల్సి వస్తుందని, నరసింహన్ ని తాము విడిచిపెట్టమని ఈ సందర్భంగా వీహెచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు తెలంగాణలో రైతులకు సంకెళ్లు వేస్తే మాట్లాడని గవర్నర్, టీఆర్ఎస్ భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు.

పొన్నం ఫైర్...

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్‌‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్‌ ప్రభుత్వ పథకాలు మెచ్చుకుంటే పరవాలేదు గానీ.. సీఎంను కాళేశ్వర చంద్రశేఖర్‌రావుగా సంభోదించడమేంటి అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీలుంటే నరసింహన్‌కు 'భజన శాఖ' కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రజలు గవర్నర్‌ నరసింహన్‌ను కల్వకుంట్ల నరసింహన్‌రావు అని అనుకుంటున్నారని వ్యంగంగా అన్నారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించిన రోజే రాజ్‌భవన్ ప్రతిష్ట మంటగలిసిందని పొన్నం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles