Pawan Kalyan to start his indefinite political yatra మీ కోసం వస్తున్నా.. అశీర్వదించండీ..: పవన్ కల్యాన్

Pawan kalyan to start his indefinite political yatra from kondagattu

Pawan Kalyan Political Yatra, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, kondagattu, anjaneya swamy temple, karimnagar, telangana, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star pawan kalyan announced that his 'indefinite' political yatra will begin from famous Kondagattu Hanuman (Anjaneyaswami) Temple in Karimnagar district.

‘‘మీ కోసం వస్తున్నా.. అశీర్వదించండీ’’: పవన్ కల్యాన్

Posted: 01/20/2018 08:51 PM IST
Pawan kalyan to start his indefinite political yatra from kondagattu

నవ్యాంధ్రలో చలోరే చలోరే చల్ పేరుతో పర్యటన చేసిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇక తెలంగాణ పర్యటనకు రెడీ అయ్యారు. అయితే తెలంగాణలోని కొండగట్టు నుంచి రెండు రాష్ట్రాలలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. 'మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి' అంటూ ఇవాళ కీలక ప్రకటన చేశారు. 'నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నాను అంటూ సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రజారాజ్యం పార్టీ తరపున 2009 ఎన్నికల ప్రచారం చేస్తోన్న సమయంలో ఇదే ప్రాంతంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి తాను క్షేమంగా బయటపడ్డానని, అందుకు కొండగట్టు ఫుణ్యక్షేత్రంలోని పవిత్ర భూమి కూడా తనను క్షేమంగా బయటపడేసిందని చెప్పారు. దానికి తోడు తన కుటుంబ ఇల వేల్పు ఆంజనేయ స్వామి కావడం కూడా ఇక్కడ నుంచి నా నిరంతర రాజకీయ యాత్రను ఆరంభించడానికి కారణభూతమైంది.

సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను' అని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఆ దేవాలయ ఫొటోను కూడా పవన్ కల్యాణ్ పోస్ట్ చేయడం విశేషం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  kondagattu  anjaneya swamy temple  karimnagar  telangana  andhra pradesh  politics  

Other Articles