mothkupalli narsimhulu sensational comments on TDP టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయండీ

Mothkupalli narsimhulu sensational comments on tdp

Politics, ttdp, senior leader, mothkupalli narsimhulu, sensational comments, NTR, NT Rama Rao, andhra pradesh politics, andhra politics, telugu politics, Telangana, policitics

Telangana senior TDP leader mothkupalli narsimhulu sensational comments on his own party, states that to amalgamate ttdp into TRS.

ఎన్టీఆర్ ఆత్మ క్షోభించకూడదంటే..: మోత్కుపల్లి

Posted: 01/18/2018 11:14 AM IST
Mothkupalli narsimhulu sensational comments on tdp

తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పార్టీ అధిష్టానంపై గత కొంత కాలంగా ముభావంగానే వుంటూ వస్తున్నారు. గవర్నర్ పదవి నేపథ్యంలో ఊహాత్మక మౌనాన్ని వహించి.. అటు అధికారపక్షంపై కానీ ఇటు విపక్షాలపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చివరాఖరున పార్టీలోని పరిస్థితులపై కూడా పెదవివిప్పకుండా వున్నారు. అయితే దాదాపుగా గవర్నర్ పదవి విషయంలో ఆయన ఆశలన్నీ అడియాశలయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లిన తరువాత ఆయన రేవంత్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో తమ పార్టీ మనుగడ ఎలా సాగిస్తుంది..? పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడి వెళ్తున్న క్రమంలో ఉనికి చాటుకోవడం కూడా కష్టంగా మారుతున్న క్రమంలో ఇవాళ మోత్కుపల్లి తన మౌనాన్ని వీడారు.

తెలంగాణలో టీడీపీ పార్టీ పూర్తిగా కనుమరుగు కాకముందే.. తెలంగాణ టిడిపి శాఖను టిఆర్ఎస్ లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి చేకూరలంటే ముందుగా పార్టీ అధిష్టానం ఈ దిశగా అడుగులు వేయాలని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణలో టిడిపి అంతరించిపోయిందనే ప్రచారం కంటే.. టీఆర్ఎస్ పార్టీలో విలీనమైందన వార్త ఎెంతో నయమని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.

ఇవాళ ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భుజాన ఎత్తుకుని పార్టీని కాపాడుకుందామన్న సహకరించే వారు లేరన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు మానసికక్షోభ అనుభవిస్తున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టిని బలోపేతం చేసే విషయమై మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయమై మోత్కుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ నేత అయిన మోత్కుపల్లి ప్రకటన తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీసింది.

మోత్కుపల్లి వ్యాఖ్యలు పార్టీలో మరో సంక్షోభానికి దారి తీస్తున్నాయా..? అనే అనుమానాలకు తావిస్తుంది. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. అయితే  చంద్రబాబుకు వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నానని, ఆయన అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. కాగా, మోత్కుపల్లి నర్సిహులు వ్యాఖ్యలపై తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పందించారు.

మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడ్డ ఎల్ రమణ, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ తమ పార్టీలో అధికమని, ఎవరైనా మాట్లాడవచ్చని అన్నారు. ఈ ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు. మోత్కుపల్లి వ్యాఖ్యలను తానేమీ సీరియస్ గా తీసుకోవడం లేదని, ఆయనతో మాట్లాడతానని అన్నారు. నేతలు పార్టీలు మారినా క్యాడర్ తమతో పాటే ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles