telangana cm kcr hints on early elections ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి మాట..

Telangana cm kcr hints on early elections along with general polls

general elections, telangana CM, assembly elections, kcr, early elections, parliament elections, lok sabha elections, party cadre, budget session

telangana chief minister KCR orders his party cadre to go to their own constituencies in lieu of early elections along with lok sabha elctions.

ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి మాట.. క్యాడర్ కు దిశానిర్దేశం..

Posted: 01/09/2018 11:46 AM IST
Telangana cm kcr hints on early elections along with general polls

జెమిలీ ఎన్నికలపై గత ఏడాది నుంచి దృష్టి సారించిన కేంద్రం. అది అసాధ్యమని తెలియడంతో.. ఇక మందస్తు ఎన్నికలకు తెరలేపనుందని కూడా వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలం క్రితం అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై పదేపదే పార్టీ సమావేశాల్లో చెప్పి కార్యకర్తలను, పార్టీ నేతలు అప్రమత్తం చేశారు. సరిగ్గా ఇప్పుడిదే పని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేస్తున్నారు. ఆయన కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయని పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేశారు.

ఈ ఏడాది చివర్లోనే సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం వుందని, ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. 2018-19 బడ్జెట్‌ తర్వాత ప్రతి ఒక్కరూ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని, నూరుశాతం విజయాన్ని అందుకునే దిశగా కార్యచరణ అమలు చేయాలని సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులందరూ.. ప్రతి ఒక్క కార్యకర్తలను కలుపుకుని పోవాలని కూడా చెప్పారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కలసికట్టుగా పనిచేయాలని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం  ముందస్తు ఎన్నికలకు వెళ్తే, అనివార్యంగా తెలంగాణ కూడా వెళ్లక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమ టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయని చెప్పిన ఆయన కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, వాటిని సర్దు కోవచ్చని వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తుందని, ఈ ఏడాది ఐదు రాష్ట్రాలకు జరగాల్సిన ఎన్నికలతో పాటు వచ్చే జూన్ నాటికి జరగాల్సిన ఎనమిది రాష్ట్రాల ఎన్నికలతో అటు లోక్ సభ ఎన్నికలకు కూడా ఒకేసారి వెళ్లాలని బీజేపి భావిస్తుందని, దీంతో జెమిలి ఎన్నికలు సాధ్యసాధ్యాలు కూడా స్పష్టత రానుందని కేంద్రం భావిస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా, నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా ఆశలు పోలేదని, 15న జరిగే కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ విషయమై స్పష్టత వస్తుందని ఆయన ప్రజా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : general elections  telangana CM  assembly elections  kcr  early elections  

Other Articles