girl's US dream comes true సరస్వతి పుత్రికకు కేంద్రమంత్రి సాయం..

Rajasthan girl s us dream comes true thanks to sushma swaraj

Sushma Swaraj, Rajasthan student dream comes true, External Affairs Minister, bhanupriya haritwal dream comes true, US visa, Jalalpur student dreams comes true, sikar student dream comes true, bhanupriya haritwal, US visa, Jalalpur, Rajasthan

External affairs minister Sushma Swaraj has come to the rescue of a 17-year-old girl from Rajasthan by helping her in getting a visa from the US embassy.

సరస్వతి పుత్రికకు కేంద్రమంత్రి సాయం..

Posted: 01/06/2018 04:25 PM IST
Rajasthan girl s us dream comes true thanks to sushma swaraj

కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మంచి మనస్సు గురించి ఎవరెంత చెప్పినా తక్కువే. అమెను ఏకంగా తమ దేశానికి ప్రధానిగా వుంటారా..? అని దాయాధి దేశ  ప్రజలే అమె చేస్తున్న సేవలను కొనియాడుతూ.. ప్రశంసిస్తున్నారంటే.. ఇక మన దేశానికి చెందిన పౌరులు కష్టాలలో వున్నారంటే అమె ఒక పట్టాన విడిచిపెట్టరన్న విషయం తెలిసిందే. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా అమె అపన్నహస్తం అందజేయడానికి ముందుంటారు.

ఇక తాజాగా రాజ‌స్థాన్‌కి చెందిన ఓ విద్యార్థినికి తన స్వప్నాన్ని సాకారం చేసేందుకు అమె స‌హాయ‌ం అందించారు. త‌న శాఖపరంగా ఎవరికీ కష్టాలు వచ్చినా వాటిని సునాయాసంగా పరిష్కరించారు. జలాల్ పుర్ కు చెందిన భానుప్రియ హరిత్‌వాల్‌ 10, 12 తరగతుల్లో విశేష ప్రతిభ కనబరిచి.. ఉన్నతవిద్య కోసం రాజస్థాన్‌ ప్రభుత్వం అందించే కోటి రూపాయల ఉపకారవేతనానికి ఎంపికైంది. కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చేయాలని ఆశించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్గత పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించింది.

ఆ త‌ర్వాతే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. విదేశాల‌కు వెళ్లాలంటే వీసా కావాలి.. అందుకోసం ఆమె ద‌ర‌ఖాస్తు చేసుకోగా దౌత్య కార్యాలయం 2 సార్లు తిరస్కరించింది. విదేశీ విద్యాల‌యంలో సీటు సాధించిన‌ప్ప‌టికీ వీసా జారీ కాకపోవ‌డంతో వెళ్ల‌లేకపోయింది. దీంతో భానుప్రియ‌ కుటుంబం స్థానిక ఎంపీని ఆశ్రయించింది. ఆయ‌న చొర‌వ తీసుకుని మంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్ల‌గా.. ఆమె వెంట‌నే స్పందించి వీసా వ‌చ్చేలా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles