ap cm comments make shiver party cadre చంద్రబాబు హెచ్చరికలతో తెలుగు తమ్ముళ్లకు వణుకు

Chandrababu naidu comments make shiver party cadre

Andhra Pradesh, Telugu Desam Party, Government Officials, Chandrababu Naidu, Prakasam, Janmabhoomi, TDP Cadre,

Andhra pradesh chief minister chandrababu naidu comments on party cadre make them shiver, while officials get boomed.

చంద్రబాబు హెచ్చరికలతో తమ్ముళ్లకు వణుకు

Posted: 01/03/2018 12:10 PM IST
Chandrababu naidu comments make shiver party cadre

తెలుగు తమ్ముళ్లు మరీ ముఖ్యంగా పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ అశిస్తున్న అశావహులలతో పాటు.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కూడా వణుకు పుడుతుంది. పార్టీ నేత జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాము పార్టీకి ఎక్కడైనా, ఎప్పుడైన అసంతృప్తిని వ్యక్తం చేశామా..? అన్న కోణంలోనూ తెలుగు తమ్ముళ్లు అలోచనలో పడ్డారు. ఎవరి వద్దైనా మరీ ముఖ్యంగా పార్టీ నేతల వద్ద ఏ సందర్భంలోనైనా చులకనగా వ్యాఖ్యలు చేశామా అన్న విషయంలోనూ పార్టీ నేతలు పునారాలోచన చేసుకుంటున్నారు.

ఇంతలా పార్టీ నేతల సింహావలోకనం చేసుకునేందుకు కారణం ఏంటీ..? ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ఈ లోపు ఎంతో కొంత పని చేసి.. ప్రజలను తమ వైపుకు తిప్పుకోవచ్చు అని భావిస్తున్న ఎమ్మెల్యేల ధోరణిలో ఎందుకు మార్పు వచ్చింది. పార్టీ నేతలు మారాలి.. మరీ ముఖ్యంగా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నిత్యం తిరుగుతూ ప్రజలతో సత్సంబంధాలను ఏర్పర్చుకోవాలి, వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నా.. దానిని అచరణలో పెడుతున్నవారి సంఖ్య తక్కువనే వినబడుతుంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఏం తప్పులు చేస్తున్నారో తనకు తెలుసునని, వారందరి తప్పులనూ తాను చిత్రగుప్తుడి లెక్కలాగా చిట్టా రాస్తున్నానని హెచ్చరించడంతో తెలుగు తమ్ముళ్లలో వణుకు మొదలైంది. అయితే అధికారులను టార్గెట్ చేస్తూ తమ అధినేత చేసిన హెచ్చరికలు వారికి కాదని అవి తమకే వర్తిస్తాయని భుజాతు తడుముకుంటున్న పార్టీ నేతలు ఇక తమ పార్టీ మరోమారు అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ అధినేత ఈ తరహా హెచ్చరికలు జారీ చేయడం సాధారణమేనని కూడా తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు.

కొందరు నాయకులూ మారేందుకు ఆసక్తిని చూపడం లేదని అన్నారు. వారిని ఏ విధంగా దారికి తీసుకురావాలో, వారిని ఎలా మార్చి పని చేయించాలో తనకు తెలుసునని అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజాబలం ఉందని, ఏ సమస్యపై అయినా, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే, వాటి పరిష్కార బాధ్యత తనదేనని చెప్పారు.  అధికారుల వెంటబడి మరీ పని చేయిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇకపై అన్ని కార్యాలయాల్లోనూ కంప్యూటర్‌ ద్వారా పనులు సాగుతాయని, దీనివల్ల పరిపాలనలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  prakasam  janmabhoomi  party cadre  officials  andhra pradesh  

Other Articles