durga temple chief priest transferred దుర్గమ్మ ప్రధాన అర్చకుడిపై వేటుతో సరా..?

Vijayawada kanakadurga temple chief priest transferred

kanakadurga temple, devotees, temple comittee, tantric pooja, chief priest badrinath babu, bejawada temple, chief priest transferred, unknown miscreant, vijayawada police, investigation, holy pilgrimage, ambati rambabu, andhra pradesh

After the cctv footage of vijayawada kanakadurga temple observed by the officials, they took action against chief priest badirinath babu by transfering him to another temple.

‘దుర్గమ్మ’ ప్రధాన అర్చకుడిపై వేటుతో సరా..?

Posted: 01/03/2018 09:16 AM IST
Vijayawada kanakadurga temple chief priest transferred

భక్తుల కొంగుబంగారమై బెజవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారన్న వార్తలు జోరందుకోగా, ఏకంగా విపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దానికి రాజకీయ టచ్ కూడా ఇవ్వడంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు మరింత అలస్యం చేయడం ఇష్టంలేక వెనువెంటనే చర్యలకు ఉపక్రమించారు. అలయంలో ప్రధానార్చకుడిపై బదిలీ వేటు వేశారు. దుర్గమ్మ అలయంలో పూజలు జరగలేదని వాదించిన ఈవో సూర్యకుమారీ.. ప్రధానార్చకుడిని బధరీనాథ్ బదిలీ ఎందుకు చేశారన్న విషయమై క్లారిటీ కూడా ఇవ్వాల్సిన పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని స్వయంగా చంద్రబాబు అదేశాలతోనే అలయంలో తాంత్రిక పూజల నిర్వహణ జరిగిందన్న అంబటి అరోపణలపై మరో రూట్ లో ప్రయాణించకముందే చర్యలకు సిద్దమయ్యారు. గత నెల 26న అర్థరాత్రి వేళ అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారని, అమ్మవారిని మహిషాసుర మర్దనిగా అలంకరణ చేసి, తాంత్రిక పూజలను జరిపించడంతో పాటు, ప్రత్యేక నైవేద్యంగా కదంబాన్ని తయారు చేయించారని వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి.

తొలుత అటువంటిదేమీ లేదని, గుడిని శుభ్రం చేసేందుకే అనుమతించామని చెప్పిన ఆలయ ఈఓ సూర్యకుమారి, వీడియో ఫుటేజ్ లు బయటకు రావడం, అందులో కొత్త వ్యక్తులు కనిపించడంతో, మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించామని, పూజల సమాచారం తెలిసిన వెంటనే ప్రధాన అర్చకుడు బదరీనాథ్‌ బాబుపై వేటు వేసి, కొండదిగువున ఉన్న కామధేను అమ్మవారి ఆలయానికి బదిలీ చేశామని వెల్లడించారు. ఆలయంపై వచ్చిన ఆరోపణల మీద దర్యాఫ్తు చేయించి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలియజేశారు.

అయితే పరమ పవిత్రమైన అలయంలో అర్చకులు తమంతట తాము నిర్ణయాలు తీసుకుని ఇలాంటి పూజలు, అందులోనూ అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించడం సాధ్యం కాదని భక్తులు వాదిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ఇలాంటి పూజలు చేయాలని ఎవరో తెరవెనుకనున్న పెద్దమనుషలు అదేశాలు జారీ చేస్తే తప్ప.. వారు ఇలాంటి పూజలు జరిపించరని, అదేశాలు జారీ చేసిన పెద్దల గుట్టు బయటపెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దుర్గమ్మ అలయంలో అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రధానార్చకుడి బదిలీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles