court orders 10 days remand to ghazal srinivas మసాజుల కీచకుడికి పదిరోజుల రిమాండ్

Save temple organiser ghazal srinivas remanded upto 12th

ghazal srinivas, kesiraju srinivas, alayavani, radio jakie, kumari, web radio, crime, violence on women, trending

Court sends Guinness World Record Awardee Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas to remanded for 10 days on molestation charges.

దొంగస్వాములను మించిన కీచకుడు.. చంచల్ గూడ జైలుకు తరలింపు

Posted: 01/02/2018 03:54 PM IST
Save temple organiser ghazal srinivas remanded upto 12th

చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది అన్నట్లు అధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్న పేరుతో ఏర్పాటు చేసిన సంస్థలు తెరచాటుగా గుడిని, గుడిలోని లింగాన్ని మింగే ప్రయత్నాలు చేయడం.. దొంగ స్వాములను మించిన కీచకపర్యాలకు తెరతీయడం తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అధ్యాత్మికత, భక్తిభావంతో వ్యవహరించే ఈ సంస్థ నీడలో తమ ఎదుగుదలను అశించి చేరిన యువతులను ఆ చెట్టే కబళించి వేస్తుందన్న నిజాన్ని జీర్ణించుకోలేక తగిన సాక్ష్యాలను సేకరించిన తరువాత పోలీసులను అశ్రయించడంతో.. ఓ ప్రముఖుడు అడ్డంగా బుకయ్యాడు.

అతడే కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్. అతడిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఇవాళ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. అదే సమయంలో బాధితురాలి ఇచ్చిన వీడియో ఫూటేజీని కూడా న్యాయస్థానంలో పొందుపర్చారు. దీంతో లైంగిక వేదింపుల కేసులో అరెస్టైన గజల్ శ్రీనివాస్ కు నాంపల్లి న్యాయస్థానం పది రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా శ్రీనివాస్ తరపు న్యాయవాదులు కూడా న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. కాగా విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ పిటీషన్ ను కోట్టివేసింది. దీంతో శ్రీనివాస్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

గజల్ శ్రీనివాస్ అరెస్టుకు గట్టి సాక్ష్యాలు: పోలీసులు

కాగా, సేవ్ టెంపుల్ సంస్థకు ప్రచారకర్తగా వ్వవహరిస్తున్న గజల్ శ్రీనివాస్ దానికి అనుబంధంగా అలయవాణి అనే వెబ్ రేడియోను కూడా నిర్వహిస్తున్నాడు. అయితే ఆలయవాణి నిర్వహణకు తన వద్ద పనిచేస్తున్న ఇద్దరు యువతులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. పంజాగుట్టలోని వెంకటరమణ కాలనీలో వున్న ఈ సంస్థలో గత జూన్ మాసం నుంచి పనిచేస్తున్న ఓ యువతి పట్ల శ్రీనివాస్ అసభ్యంగా వ్యవహరిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేశాడు.

గత రెండు నెలలుగా అమె పట్ల అధికమైన లైంగిక వేదింపులను అమె కలత చెందిన చివరకు బుద్ది చెప్పాలని భావించింది. శ్రీనివాస్ వేధింపులను రికార్డు చేసిన అమె అన్ని అధారాలను తీసుకుని పోలీసులకు సమర్పించి.. శ్రీనివాస్ వేధింపులపై పిర్యాదు చేసింది. దీంతో అధారాలన్నింటినీ పరిశీలించిన తరువాత శ్రీనివాస్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇది చాలా తీవ్రమైన కేసుగా పరిగణించామని, బాధితురాలి అర్థిక పరిస్థఇతులను అసరాగా చేసుకుని గజల్ శ్రీనివాస్ బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు.

అధ్యాత్మికత పేరుతో అసభ్యకర సేవలు..

ఇక తన సంస్థలో పనిచేసే యువతులతో బాడీ మసాజ్ లు, కాళ్లు ఒత్తించుకోవడాలు చేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన పిర్యాదులో పేర్కోనడంతో అరెస్టు సందర్భంగా స్పందించిన గజల్ శ్రీనివాస్ ఆమెతో తాను మసాజ్ చేయించుకోలేదని, ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. తన భుజానికి దెబ్బతగిలిందని, ఒక రోజు ఫిజీషియన్‌ రాకపోయేసరికి ఆ యువతి మసాజ్‌ చేస్తానని చెప్పిందని అన్నారు. తాను వద్దంటున్నప్పటికీ ఆమే తన భుజానికి మందు రాసిందని తెలిపారు. అంతేగాని తాను చెడు భావనతో మసాజ్ చేయించుకోలేదని చెప్పారు.

ఫిర్యాదు చేసిన ఆ యువ‌తిని తాను ఓ బిడ్డ‌లా చూశానని గజల్‌ శ్రీనివాస్ తెలిపారు. తామంతా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ, ఆ భావ‌న‌తోనే ప‌నిచేస్తామ‌ని, అటువంటిది ఇటువంటి ఆరోప‌ణ‌లు ఎందుకు చేస్తుందో అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. ఇక తన కార్యాలయం నుంచి వీడియో ఫూటేజీ దొంగలించిందన్న కేసులో తనను పోలీసు కేసు నమోదు చేయాలని కొందరు పరిచయస్థులు కూడా తనకు సలహాఇచ్చినా తాను అలా చేయలేదని చెప్పారు. కాగా ఈ కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి పూర్తి ఆధారాలను బాధితురాలు పోలీసులకు ఇచ్చిన త‌రువాతే ఆయ‌నను అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ghazal srinivas  kesiraju srinivas  alayavani  radio jakie  kumari  web radio  crime  violence on women  trending  

Other Articles