pannel summons Sasikala, Apollo Hospital chairman శశికళ, అపోలో అసుపత్రులకు నోటీసులు

Jayalalithaa death probe panel summons sasikala apollo hospitals

Jayalalithaa death, Sasikala, J Jayalalithaa, Jayalalithaa death probe, Tamil Nadu, Apollo Hospital, apollo hospital chaitman, pratap reddy, jayalalithaa death probe commission, Jayalalithaa, Sasikala, Apollo Hospital, pratap reddy, probe commission, arumugaswamy

The panel set up to investigate the death of former Tamil Nadu Chief Minister J Jayalalithaa summoned her aide and ousted party general secretary VK Sasikala, and Pratap Reddy, the chairman of Chennai’s Apollo Hospital

జయ మృతి మిస్టరీ: శశికళ, అపోలో అసుపత్రులకు నోటీసులు

Posted: 12/22/2017 03:03 PM IST
Jayalalithaa death probe panel summons sasikala apollo hospitals

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత మృతికి సంబంధించిన కేసు విచారణను న్యాయస్థానం వేగవంతం చేసింది. జయలలిత మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన పలువురు.. న్యాయస్థానాలను అశ్రయించి పిటీషన్లు కూడా ధాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటీషన్లను గతంలోనే విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. తాజాగా విచారణను మాత్రం వేగవంతం చేసింది.

జయలలిత మరణం కేసులో మిస్టరీని తేల్చేందుకు ఇప్పటికే ఒక రిటైర్డు న్యాయమూర్తితో కమీషన్ ను వేసిన న్యాయస్థానం..దాని అధ్వర్యంలోనే దర్యాప్తు జరుగుతుందని చెప్పింది. కాగా ఈ కమిషన్ అధ్వర్యంలోనే కేసు విచారణ వేగిరమయ్యింది. ఈ కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న జయలలిత నెచ్చెలి శశికళకు సమన్లు జారీ చేసింది.

అమెతో పాటుగా చెన్నై అపోలో అసుపత్రికి యాజామాన్యానికి కూడా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ ఆరుముగస్వామి నేతృత్వం వహిస్తున్న కమీషన్ నోటీసులను అందజేసింది. తాము నిర్ధేశించిన గడువులోగా అమ్మ మరణంపై సమాధానాలను ఇవ్వాలని అదేశించింది. ఈ క్రమంలో అపోలో అసుపత్రికి 10 రోజుల పాటు గడువును నిర్ధేశించిన న్యాయస్థానం.. జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు మాత్రం పక్షం రోజుల గడువును ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jayalalithaa  Sasikala  Apollo Hospital  pratap reddy  probe commission  arumugaswamy  

Other Articles