FRDI bill: Long queues in banks for withdrawing money బ్లో ఇన్ దెబ్బకు బ్యాంకుల వద్ద కస్టమర్ల క్యూ

Frdi bill long queues in banks for withdrawing money panic among people

bank, frdi bill, money, depositors, blow-in, bank managers, customers, crores of rupees, hyderabad news, india news, social news, latest news

Customers are standing in long queues to withdraw money from banks. So far, crores of rupees have been withdrawn from various banks. Bank managers are making futile efforts to pacify people.

అప్పుడు నోట్లరద్దు.. ఇప్పుడు బ్లో-ఇన్.. బ్యాంకుల వద్ద క్యూ

Posted: 12/22/2017 10:42 AM IST
Frdi bill long queues in banks for withdrawing money panic among people

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది నవంబర్ 8 న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనుకున్న మేర అశించిన అంచానాలను సాధించడంలో విఫలమైందన్న విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అటు విపక్షాలతో పాటు ఇటు అర్థిక నిపుణులు, విశ్లేషకులు కూడా ఇదే మాటను తేల్చి చెబుతున్నారు. దీనికి తోడు సొంత పార్టీకి చెందిన కేంద్ర మాజీ అర్థిక శాఖా మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు.

ఎవరెన్నీ విమర్శలు చేసినా.. పట్టనట్లు వ్యవహరిస్తున్న కేంద్రం.. నోట్ల రద్దు నిర్ణయంతో అప్పట్లో దేశ ప్రజలను మాత్రం బ్యాంకుల చుట్టూ తిరిగేలా.. పడిగాపులు కాసేలా చేసి.. తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్పుకోవడం మాత్రం మానలేదు. ఇక తాజాగా ఎఫ్ఆర్డీఐ (ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్) బిల్లు విషయంలోనూ కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్టీ స్వయంగా హామీలు ఇస్తున్నా.. ప్రజలు మాత్రం ఆయననే కాదు కేంద్రంలోని ప్రభుత్వాన్ని కూడా విశ్వసించే పరిస్థితిలో లేరు. దీంతో ఎవరి నిర్ణయం ఎలా వున్నా తమ సొమ్మ తమ వద్దే అట్టిపెట్టుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారు.

అసలేంటీ ఎఫ్ఆర్డీఐ బిల్లు అంటారా..? దీని వల్ల ఏం జరుగుతుంది..? అంటారా..? కేంద్రం తాజాగా చేపట్టిన అర్థిక సంస్కరణల్లో ఎఫ్ఆర్డీఐ బిల్లు ఒక్కటి. అయితే ఇది అమలులోకి రావడంతో, బ్యాంకులు నష్టాల్లో వున్న సమయాల్లో తమ వద్ద డిపాజిట్ల రూపంలో వున్న డబ్బును అవి వాడుకునే వెసలుబాటు కల్పిస్తూ ప్రభుత్వం కొత్తగా ఎఫ్ఆర్డీఐ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. అయితే వాడుకున్న డబ్బును బ్యాంకులు తిరిగి ఇవ్వనూ వచ్చు.. లేదా ఇవ్వకపోవచ్చు.

అయితే తమ డబ్బు భద్రంగా వుంచేందుకు బ్యాంకుల్లో వేస్తున్నా.. అవి నష్టాల్లో వుంటే సోమ్ము తిరిగి వస్తుందా..? లేదా.? అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేక వడ్డీ కాదు అసలుపై కూడా అనుమానాపు నీలినీడలు అలుముకోవడం.. ఈ మరేకు ప్రచారం జోరుగా సాగుతుండగా, ప్రజలు తీవ్ర ఆందోళనతో బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వరంగల్ లో నిన్న ఒక్కరోజులోనే రెండు బ్యాంకుల నుంచి రూ. 6 కోట్ల నగదు విత్ డ్రా కాగా, ఖాతాదారులకు నచ్చజెప్పలేక అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.

తమ ఖాతాలను ఖాళీ చేస్తున్న ప్రజలు, డిపాజిట్లను సైతం వెనక్కు తీసుకుంటుండగా, ఈ ప్రచారం ఇతర పట్టణాలకూ పాకింది. ఈ ఉదయం పలు పట్టణాల్లోని బ్యాంకుల వద్ద జనం తమ డబ్బులను వెనక్కు తీసుకునేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది.  ఇక కొత్త చట్టం ఏమీ రాదని, ఎవరి డబ్బుకూ ఇబ్బంది ఉండదని బ్యాంకుల మేనేజర్లు చెబుతుంటే, ఇప్పటికి మాత్రం తమ డబ్బు వెనక్కు ఇవ్వాలని, అటువంటి బిల్లు రాకుంటే అప్పుడు తిరిగి డిపాజిట్ చేస్తామని ఖాతాదారులు చెబుతుండటం గమనార్హం.

వరంగల్ లోని ఓ బ్యాంకులో 30 వరకూ ఫిక్సెడ్ డిపాజిట్లు ఉండగా, అందులో 15 మంది తమ డబ్బును వెనక్కు తీసుకోవడం గమనార్హం. దిగువ, మధ్య తరగతి ప్రజలు అధికంగా బ్యాంకులకు వస్తున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా, వాట్స్ యాప్ లో జరుగుతున్న ప్రచారాన్ని చూసి తాము డబ్బు విత్ డ్రా కోసం వచ్చినట్టు పలువురు వ్యాఖ్యానించారు. ఇక ఇదంతా వదంతేనని, ఇటువంటి ప్రచారం తగదని, ఖాతాదారులను అయోమయంలో పడవేయవద్దని, ఈ ప్రచారాన్ని నమ్మవద్దని బ్యాంకుల అధికారులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles