EC bans airing footage of Jayalalithaa ‘అమ్మ’ వీడియోపై ఈసీ సీరియస్..

Rk nagar bypoll ec bans airing footage of jayalalithaa

aiadmk, all india anna dravida munnetra kazhagam, apollo hospital, chennai, dr radhakrishnan nagar, election commission, jayalalithaa, jayalalithaa death, rk nagar by election, rk nagar bypoll, video of jayalalithaa inside apollo hospital, aiadmk, jayalalithaa, sasikala, rk nagar by-election, apollo hospital, ttv dinakaran, politics, cmcm, india, latest news

A day ahead of a critical by-election here, sidelined AIADMK leader T.T.V. Dinakaran's faction on Wednesday triggered a major row by releasing a video clip of the late J. Jayalalithaa purportedly on her hospital bed,

‘అమ్మ’ వీడియోపై ఈసీ సీరియస్.. ప్రసారంపై బ్యాన్..

Posted: 12/20/2017 02:47 PM IST
Rk nagar bypoll ec bans airing footage of jayalalithaa

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసినదిగా బయటకువచ్చిన వీడియోపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అమ్మ మరణంలో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ వీడియో వెలుగులోకి రావడంపై ఈసీ అగ్రహం వ్యక్తం చేసింది. ఈ విడియోను ప్రసారమాధ్యమాలు ప్రసారం చేయకూడదంటూ అదేశాలను కూడా జారీ చేసింది.

అపోలో అస్పత్రిలో జయలలిత పూర్తిగా అపస్మారక స్థితిలోనే వున్నారని, అమెను తీసుకురావడమే అమెను అపస్మారక స్థితిలోనే తీసుకువచ్చారన్న వార్తలు సరిగ్గా అర్కే నగర్ ఎన్నికలకు ముందు విడుదల కావడంతో.. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలంటూ తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఈ వీడియోను విడుదల చేశారా? అనే కోణంలో సీఈసీ దృష్టి సారించింది. మరోవైపు ఈ వీడియోపై అన్నాడీఎంకే కూడా మండిపడింది.

దినకరన్ వర్గంలోని అనర్హత వేటు పడిన నేత ఈ వీడియోను విడుదల చేశారు. జయకు మెరుగైన చికిత్స అందించామని తెలియజేసే క్రమంలో ఈ వీడియోను వ్యూహాత్మకంగా బయటపెట్టారు. జయలలిత మరణానికి శశికళే కారణమంటూ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తద్వారా ఉప ఎన్నికలో సానుభూతి ద్వారా ఓట్లను సాధించేందుకు ఎత్తుగడ వేశారని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఈ వీడియోపై ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గీయులు మండిపడుతున్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాదని, వీడియోలో ఉన్నది జయలలిత కాదని, ఇది మార్ఫింగ్ వీడియో అని ఆరోపించారు. జయలలిత మరణించిన తర్వాత కానీ, ఈ ఏడాది కాలంగా కానీ బయటపెట్టని వీడియోను, ఇప్పుడు ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న జయను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదన్న విషయమై అయన అనుమానాలను వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఈ వీడియోపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఇది ముమ్మాటికీ మార్ఫింగ్ వీడియోనే అని తెలిపారు. కాగా డీఎంకే అగ్రనేత స్టాలిన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని అత్యంత దిగజారుడు స్థాయికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. వీళ్లా, వాళ్లా అన్న విషయాన్ని పక్కనబెడితే.. ఆ పార్టీ అధినేత్రికి గత ఏడాది కాలంగా ఆ పార్టీ నేతలు మిగిల్చింది అవమానం, అపకీర్తేనేనని మండిపడ్డారు.

ఇక తమిళనాడులోని దివంగత జయలలిత అస్పత్రి వీడియోపై అత్యంత వేగంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అదే గుజరాత్ లో ప్రధాని నరేంద్రమోడీ వాడిన దిగజారుడు వ్యాఖ్యలపైన.. లేక ఎన్నికల రోజు ఆయన ఓటు వేసిన అనంతరం నిర్వహించిన ర్యాలీపైన మాత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు కనిపంచడం లేదని పలువురు నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా కేంద్ర చేతిలో అస్త్రంగానే మారిపోయిందని ఇప్పటికే పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్న క్రమంలో జయలలిత వీడియోపై ఈసీ వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aiadmk  jayalalithaa  sasikala  rk nagar by-election  apollo hospital  ttv dinakaran  politics  

Other Articles