Air Deccan to relaunch operations with Re 1 tickets రూ.1కే విమానం టికెట్..

Air deccan to debut again with flight tickets starting at rs 1

Airfare sale, Air Deccan, Air Deccan Re 1 offer, Air Deccan offer, Re 1 air ticket, free air ride, free air ticket, free plane tickets, airliner tickets, low cost airline, UDAN flights, UDAN, regional connectivity scheme

Airfare sale has been unveiled and this one is like taking a trip virtually free! India’s first domestic low-cost airline Air Deccan is set to relaunch operations this month.

రూ.1కే విమానం టికెట్.. ఎయిర్ డెక్కన్ పునరాగమన అఫర్

Posted: 12/13/2017 02:24 PM IST
Air deccan to debut again with flight tickets starting at rs 1

దేశీయ విమానయాన రంగంలోనే అత్యంత చౌక ధరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు తొలి బడ్జెట్ విమానయాన సంస్థగా ఖ్యాతికెక్కిన ఎయిర్ డెక్కన్ మళ్లీ వైమానిక మార్కెట్లోకి పునరాగమనం చేయనుంది. మద్యతరగతి ప్రజలకు కూడా విమానయాన అవకాశాన్ని కల్పించిన ఈ సంస్థ  త్వరలోనే మళ్లీ పునరాగమనం చేయనుంది. తమ సేవలను తిరిగి ప్రారంభిస్తున్న క్రమంలో భారీ ఎత్తున్న ప్రచారం చేయనుంది. ఇందులో భాగంగా కొందరు లక్కీ ప్రయాణికులకు రూపాయికే విమాన టికెట్ ఇవ్వనుందట.

అధికాదాయ వర్గాలకు మాత్రమే పరిమితమైన విమానయాన ప్రయాణాన్ని చౌక ధరలతో మధ్యతరగతి ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థను 2003లో జీ.ఆర్‌. గోపినాథ్‌ ప్రారంభించారు. 2008లో ఈ సంస్థ కింగ్ ఫిషర్‌ ఎయిర్ లైన్స్ లో విలీనమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులకు ఎక్కువవడంతో 2012లో ఈ సంస్థ సర్వీసులను నిలిపివేసింది. కాగా.. త్వరలోనే ఈ ఎయిర్ లైన్ తన సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. ఈ మేరకు గోపినాథ్‌ మీడియాకు తెలుపుతూ.. ఈ నెలాఖరులో ముంబయి, దిల్లీ, కోల్ కతా, షిల్లాంగ్ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడపనున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌ 22న ముంబయి నుంచి నాసిక్ కు తొలి ఎయిర్ డెక్కన్ విమానం నడపనున్నారని తెలిపారు. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు తక్కువ ధరలకే విమాన టికెట్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్‌ కన్నా తక్కువగా 40 నిమిషాల ప్రయాణానికి రూ.1400 ఛార్జీ చేసి ప్రయాణికులను అకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. అంతేగాక.. ప్రారంభ రోజుల్లో కొందరు లక్కీ ప్రయాణికులకు కేవలం రూ.1కే విమాన టికెట్‌ అందించనున్నారని కూడా సంస్థ వర్గాలు తెలిపాయి. జనవరి చివరి వరకు మిగతా మూడుచోట్ల కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎయిర్ డెక్కన్ పూర్తి షెడ్యూల్ పై మాత్రం స్పష్టత లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airfare sale  Air Deccan  Re 1 offer  free plane tickets  low cost airline  UDAN flights  

Other Articles