Rajamouli's son involved in Amaravathi designs too? అమరావతి డిజైన్లు: రాజమౌళి కొడుకు ప్రమేయమెందుకు.?

Rajamouli s son involved in amaravathi designs too

AP government, Rajamouli, amaravati designs, AP's state capital, Amaravati constructions, Rajamouli's son karthikeya, karthikeya official meet with CM, Chandrababu, Andhra Pradesh, APCRDA, capital region development authority, AP government, Rajamouli, amaravati designs, AP's state capital, Amaravati constructions, karthikeya, offical meeting, CM Chandrababu, Andhra Pradesh

AP government has sought Rajamouli's help in the designs of the AP's state capital Amaravati and its constructions, Rajamouli's son too accompanied him in the official meet with CM Chandrababu,

రాజమౌళితో అమరావతికి కార్తీకేయ కూడా వెళ్తాడా.?

Posted: 12/11/2017 06:43 PM IST
Rajamouli s son involved in amaravathi designs too

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నవ్య రాజ‌ధాని అమరావతి ఆకృతుల‌ు ఇక తుది దశకు చేరుకోనున్నాయి. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్రితం రోజున భేటీ అయిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఇప్పటికే తుది మార్పులు చేర్పులను వివరించారని సమాచారం. అమరావతి రాజధాని నిర్మాణంలో రాజమౌళి సాయాన్ని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి రేపు అమరావతికి కూడా వెళ్లనున్నారని సమాచారం. అమరావతిలో ఏపీ మంత్రి నారాయ‌ణ‌, నార్మన్‌ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో భేటీ కానున్నారు.

అనంత‌రం చంద్ర‌బాబుతో కూడా రాజమౌళి స‌మావేశం కానున్నారని సమాచారం. రాజ‌ధాని ఆకృతుల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు ఎల్లుండి ఖరారు చేసి, ప్ర‌జాభిప్రాయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రాజ‌మౌళి ప‌లుసార్లు రాజ‌ధాని ఆకృతుల‌పై చ‌ర్చించారు. దీంతో ఇక అకృతులను ఫైనల్ చేయనున్న తరుణంలో రాజమౌళి బృందం ఫైనల్ గా అమరావతిలో పర్యటించి.. నార్మన్ సోస్టర్ ప్రతినిధులతో భేటీకానున్నారు. రాజధాని నిర్మాణంలో అకృతులను ఫైనల్ చేస్తున్న క్రమంలో రాజమౌళికి ఇస్తున్న ప్రాధాన్యతపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విమర్శలను ఎధర్కొవాల్సి వస్తుంది.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పలుమార్లు భేటీ అయిన రాజమౌళి బృందంలో రాజమౌళితో పాటు ఆయన కుమారుడు కార్తీకేయ కూడా పాల్గొనడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు తన తండ్రి తీసే సినిమా ప్రమోషన్ పనుల్లో పాలుపంచుకున్న కార్తీకేయ.. ఇక రాజధాని విషయంలో కూడా తండ్రికి సాయం చేశారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇక కొడుకు సాయం తీసుకోవడంలో రాజమౌళి తప్పు లేదు కానీ.. ఆయనను వెంటబెట్టుకుని చంద్రబాబు సహా మంత్రులు, ఉన్నతస్థాయి అధికారుల వద్దకు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి విషయంలోనే గగ్గోలు పెడుతున్న పార్టీలకు ఇది మరో అవకాశాన్ని అందించనట్లేనేమో. అయితే దీనిపై దర్శకధీరుడు ఏం సమాధానం ఇస్తాడో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles