Hindu Jagran Manch launches 'reverse love jihad' లవ్ జిహాద్ కు అరెస్సెస్ అనుబంధ సంస్థ కౌంటర్..

Hindu jagran manch launches reverse love jihad

nation, Hindu Jagran Manch, Uttar Pradesh, Love jihad, reverse love jihad, hindu muslim divide, religious conversion

The Hindu Jagran Manch, an affiliate of the Rashtriya Swayamsevak Sangh, has announced that from next week it will marry 2,100 Muslim women to Hindu men

లవ్ జిహాద్ కు అరెస్సెస్ అనుబంధ సంస్థ కౌంటర్..

Posted: 12/02/2017 06:08 PM IST
Hindu jagran manch launches reverse love jihad

లవ్ జిహాద్ కు కౌంటర్ ఇచ్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫిక్స్ అయ్యింది. హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు పెళ్లిళ్లు చేసుకుంటే దానికి లవ్ జిహాద్ అని నామకరణం చేసిన అరెస్సెస్.. అదే ముస్లిం అమ్మాయిలను హిందూ యువకులు పెళ్లిళ్లు చేసుకుంటే మాత్రం ప్రోత్సహించి.. పెళ్లి ఖర్చులు భరించి మరీ రక్షణగా నిలబడతామని ప్రకటిస్తోంది. లవ్ జీహాద్ తరహా మతాంతర వివాహాలపై ఉక్కుపాదం మోపుతున్న క్రమంలోనే వారి అమ్మాయిలను హిందూ యువకులు చేసుకునే మతాంతర వివాహాలను మాత్రం ప్రోత్సహిస్తామని చెబుతుంది.

ఈ క్రమంలోనే ఆరెస్సెస్ అనుబంధ సంస్థ హిందూ జాగరణ్ మంచ్ (హెచ్‌జేఎం)  సమాయత్తమవుతోంది. ఇందుకు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ బేటీ బగావో, బేటీ పడావో స్లోగన్ కాస్త తమకు అనుకూలంగా మార్చేసుకుని  ‘బేటీ బచావో, బాహు లావో’ (ఆడపిల్లలను రక్షించు.. కోడళ్లను తీసుకురా) కార్యక్రమాన్ని మరీ ప్రచారం చేస్తుంది.  హిందూ యువకులను వివాహం చేసుకోవాలని భావించే ముస్లిం యువతులకు అండగా నిలిచి, వారికి రక్షణ కల్పించి వివాహాలు చేయనుంది. మొత్తంగా 2100 ముస్లిం యువతుల వివాహాలు జరిపించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించనుంది.

ఈట్ కా జవాబ్ పత్తర్ సే అన్నట్లుగా ‘‘వారికి  వారి భాషలోనే సమాధానం చెబుతాం’’ అని హెచ్‌జేఎం రాష్ట్ర చీఫ్ అజ్జు చౌహాన్ తెలిపారు. మతాంతర వివాహాల వల్ల జనాభాను నియంత్రించడం కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ‘లవ్ జిహాద్’ను ఆపకుంటే ముస్లిం యువతులను ఆకర్షించేందుకు బజరంగ్ దళ్ యువకులను పంపించాల్సి ఉంటుందని ఇటీవల విశ్వహిందూ పరిషత్ హెచ్చరించిన నేపథ్యంలో హిందూ జాగరణ్ మంచ్ మరో అడుగు ముందుకేసీ మరీ కల్యాణాలకు శ్రీకారం చుడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles