YSR Congress MLA Eswari joins TDP సైకిల్ సవారీ: టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి

Ysr congress mla eswari joins tdp

Giddi Eswari joins tdp, paderu mla joins tdp, another jolt to ysrcp, chandrababu naidu, YSRCP, paderu mla, MLA Giddi Eswari, ys jagan, TDP, araku, Visakapatnam, andhra pradesh, politics

Another legislator from YSR Congress, Giddi Eswari, representing Paderu (ST) from the district, joined the ruling TDP on Monday in the presence of Chief Minister and TDP president N Chandrababu Naidu.

సైకిల్ సవారీ: టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి

Posted: 11/27/2017 09:53 AM IST
Ysr congress mla eswari joins tdp

విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇవాళ అధికారికంగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమె పార్టీలో చేరారు. ఇవాళ అమరావతికి వెళ్లిన ఈశ్వరి అక్కడే ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమెకు తమ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. గిడ్డి ఈశ్వరితో పాటు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు.

అభివృద్ధికి దూరంగా ఉన్న పాడేరు నియోజకవర్గానికి మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలిపారు. కాగా, 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం.

కాగా గిడ్డి ఈశ్వరి చేరికతో ఇప్పటివరకూ 22 మంది విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే నలుగురిలో లేక ఐదుగురినో అయితే అధికారపక్షం అక్రమంగా లాగేసుకుందన్న వాదనను బలపర్చిన రాజకీయ విశ్లేషకులు.. ఏకంగా మూడేళ్ల తరువాత కూడా ఎమ్మెల్యేలు ఇలా అధికారపార్టీలోకి వలసవెళ్లడంపై కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  paderu mla  MLA Giddi Eswari  ys jagan  TDP  araku  Visakapatnam  andhra pradesh  politics  

Other Articles