EX CM Defends Father's Controversial remark on PoK | తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కొడుకు మాత్రం సవాల్

Omar abdullah defends father remarks

Farooq Abdullah, PoK Comments, Omar Abdullah, Omar Abdullah Centre, Omar Abdullah PoK Issue, Farooq Abdullah PoK Comments

Farooq Abdullah’s controversial remark on PoK: Son Omar Abdullah says, Centre should prove my father wrong with actions."What is stopping you from getting back PoK, prove my father wrong" he said to Centre

రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. తప్పుంటే నిరూపించండి

Posted: 11/17/2017 08:56 AM IST
Omar abdullah defends father remarks

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పాకిస్థాన్ కు చెందినదేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కేంద్ర మంత్రి హన్స్ రాజ్ ఆహిర్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. పీవోకేను భారత్ చేజిక్కించుకోవాలనుకుంటే ఎవరూ ఆపలేరని తెలిపారు.

అయితే తండ్రి ఫరూఖ్ కు మద్ధతుగా ఇప్పుడు కొడుకు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. మాటలు చెప్పటం కాదు.. పీవోకేను వెనక్కి తీసుకురావాలని అంటున్నాడు. దమ్ముంటే.. తన తండ్రి (ఫరూఖ్ అబ్దుల్లా) మాటలను తప్పని చేతల్లో నిరూపించాలని ఆయన సవాలు విసిరారు.‘‘మేం ప్రయత్నిస్తే అని అంటున్నారు. దాని అర్థమేమిటో ఎవరికీ తెలియడం లేదు’’ అని ఒమర్ చెప్పుకొచ్చారు. చేతనైతే పీవోకే ను భారత్ లో కలిపి చూపించండి అంటూ సవాల్ విసిరాడు.

కాగా, పీవోకే పాక్ దేనన్న ఫరూఖ్.. జమ్ము కశ్మీర్ మాత్రం భారత్ దేనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇరు దేశాలు ఎన్ని యుద్ధాలు చేసిన, ఒప్పందాలు చేసుకున్నా అన్నీ వృథా అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles