Robbers dig tunnel to a Bank in Navi Mumbai | పక్క షాపు నుంచి బ్యాంకుకు సొరంగం.. ముంబైలో భారీ దోపిడీ... అన్నీ అనుమానాలే

Navi mumbai bank robbery details

Navi Mumbai, Bank of Baroda Robbery, Mumbai Tunnel Robbery, Juinagar, Navi Mumbai Robbery, Mumbai Robbery

Robbers dig 50 Feet tunnel to loot bank in Navi Mumbai. Thirty lockers in the Juinagar branch of Bank of Baroda were broken into over the weekend by burglars who dug a tunnel to the bank from a neighbouring shop. The burglary was discovered only on Monday morning, when the bank resumed work after the weekend.

షాక్ : సొరంగం తవ్వి బ్యాంకు దోపిడి.. అనుమానాలు!

Posted: 11/14/2017 08:11 AM IST
Navi mumbai bank robbery details

భారీ సొరంగం.. బ్యాంకుకే కన్నం.. పైగా అలరంలు మోగలేదన్న అనుమానాలు. ఇది ప్రస్తుతం ముంబై పోలీసుల ముందున్న భారీ సవాలు. పథకం ప్రకారం దోచుకున్న దొంగలు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. నవీ ముంబైలోని జుయ్‌నగర్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఆదివారం జరిగిన దోపిడీ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శని, ఆదివారాల సెలవు తర్వాత సోమవారం బ్యాంకును తెరిచిన అధికారులు యథావిధిగా బ్యాంకు కార్యకలాపాల్లో మునిగిపోయారు. అయితే ఓ ఖాతాదారుడు తన లాకర్‌ను ఓపెన్ చేసేందుకు స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లగా చోరీ విషయం బయటపడింది. స్ట్రాంగ్ రూమ్‌లోని లాకర్లు అప్పటికే ఓపెన్ చేసి ఉండడాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. క్షుణ్ణంగా పరిశీలించగా బ్యాంకుకు ఓ మూల చిన్న సొరంగం లాంటిది కనిపించింది. దొంగలు దాని గుండా లోపలికి వచ్చి లాకర్లను దోచుకున్నట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 27 లాకర్లు చోరీకి గురైనట్టు నిర్ధారించారు. బ్యాంకు పక్కనే ఉన్న షాపు నుంచి సొరంగం తవ్వినట్టు గుర్తించారు. దొంగలు దోచుకున్న వాటిలో ఎక్కువగా బంగారు ఆభరణాలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. లాకర్లలో దాచుకున్న వస్తువులపై ఖాతాదారుల నుంచి బ్యాంకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles