Hardik Sex Video Gujarat Dirty Politics | డర్టీ వీడియో : హార్దిక్ సెక్స్ క్లిప్... ఫారిన్ లో మార్ఫింగ్ చేశారంటున్న యువ నేత

Gujarat dirty politics out after hardik clip viral

Hardik Patel, Hardik Patel Sex Clip, Hardik Patel Video, Hardik Patel Viral Video, Gujarat Elections, BJP Hardik Patel Clip

Video clip claiming Hardik in compromising situation goes viral. BJP may use fake sex CD to defame me before Gujarat elections, alleges Hardik Patel.

ITEMVIDEOS:హార్దిక్ సెక్స్ సీడీ... డర్టీ పాలిటిక్స్

Posted: 11/14/2017 08:31 AM IST
Gujarat dirty politics out after hardik clip viral

గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్‌ వీడియోగా విడుదలైన ఓ సెక్స్ క్లిప్ ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఆయన త్వరలో గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు కూడా చేరువయ్యారు కూడా.

ఈ సమయంలో ఆయన రాసలీలల సీడీ బయటపడడం రాజకీయంగా పెను దుమారమే లేపుతోంది. గుజరాత్ ఎన్నికల వేళ ఈ సీడీ బయటపడడంతో దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మే 16న చిత్రీకరించినట్టు రికార్డయిన ఆ సీడీలో హార్ధిక్‌ లా వున్న వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. సీక్రెట్ కెమెరాలతో ఈ తతంగం అంతా చిత్రీకరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక తన సెక్స్ సీడీ బయటపడడంపై హార్ధిక్ పటేల్ స్పందించాడు.

తనను దెబ్బకొట్టి, గుజరాత్ ఎన్నికల్లో లాభ పడేందుకే ఈ సీడీని బయటపెట్టారంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశాడు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. గుజరాత్ మహిళల ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదో భాగమని విమర్శించాడు. హార్ధిక్ పటేల్ ఎలాంటివాడో బీజేపీకి బాగా తెలుసని, అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకుంటే మంచిదని బీజేపీకి హితవు పలికారు. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించి చెప్పానని హార్ధిక్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles