Tejashwi as CM face, says Lalu Prasad Yadav అర్జేడీ అధినేత లాలూ యాదవ్ సంచలన ప్రకటన

Lalu prasad yadav hints tejashwi will be rjd s 2020 cm candidate

Lalu Prasad Yadav, Rashtriya Janata Dal, Nitish Kumar, Tejashwi Prasad Yadav, Bihar Assembly polls, Ram Chandra Purve, Raghuvansh Prasad Singh, Abdul Bari Siddiqui, latest news

RJD President Lalu Prasad Yadav theoretically handed over his political legacy to his younger son Tejashwi Prasad Yadav, when he hinted that he will be naming him as the party's cm candidate in the 2020 Bihar Assembly polls.

అర్జేడీ అధినేత లాలూ యాదవ్ సంచలన ప్రకటన

Posted: 11/11/2017 09:58 AM IST
Lalu prasad yadav hints tejashwi will be rjd s 2020 cm candidate

గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీయేతర శక్తులన్నీ కూటమిగా ఏర్పడి మహా కూటమి పేరుతో అధికారాన్ని సాధించుకున్నా.. నితీష్ కుమార్ అధ్వర్వంలోని జేడీయు మాత్రం కొంత బిన్న స్వరాన్ని అలపించి.. కేంద్రంలోని అధికార బీజేపితో జతకట్టి కూటమి మిత్రులకు వెన్నుపోటు పోడిచిన నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ఇప్పట్నించే పావులు కదుపుతున్న అర్జేడీ తమ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించేసింది.

2020లో జ‌రిగే బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. పార్టీ సీనియర్ నేతలు అబ్దుల్ బరి సిద్ధిఖి, రఘువంశ్ ప్రసాద్ సింగ్ లతో స‌మావేశం తన చిన్న కుమారుడు, బీహార్ మాజీ డిఫ్యూటీ ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ను ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు సమర్థత కలిగిన నేతగా, పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగాడని కూడా అన్నారు.

2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు తేజస్వి యాదవ్ త‌మ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపిస్తారని స్ప‌ష్టం చేశారు. త‌న కుమారుడు తేజస్వి పార్టీకి అందిస్తోన్న సేవ‌లు అద్భుత‌మ‌ని కొనియాడారు. తేజస్వి యాదవ్ బీహార్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ బీహార్ ప్రజలు ఇపట్నించే మాట్లాడుకోవడంలో తప్పు ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు. ఇది తన నిర్ణయం కాదని పార్టీ నేతలు నిర్ణయమని చెప్పుకోచ్చారు.

అంతకుముందు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ పుర్వే బీహార్ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ పేరును ప్రతిపాదించగా దాన్ని ఇత‌ర నేత‌లు కొంద‌రు వ్య‌తిరేకించారు. తేజ‌స్వి యాద‌వ్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన అంశంపై ఆర్జేడీ నేత‌ల్లో కొంత‌మంది అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల కాలం వున్న నేపథ్యంలో అప్పటి వరకు పార్టీలోని వ్యతిరేక గొంతులన్నీ ధోరణి మార్చుకుంటాయన్న అభిప్రాయాలను కూడా పార్టీ వ్రర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles