no action on having old notes, Says Centre రద్దైన పాతనోట్లు వున్నాయా.. కేసుల భయం వలదు..

No action against those still having old notes says centre

demonetisation, Supreme Court, SC, old notes, demonitised notes, sudha mishra, petition, centre

Those who were not been able to deposit scrapped notes by December 31 last year and filed petitions in the Supreme Court (SC) about the issue, will not be prosecuted, the Centre told the Supreme Court

రద్దైన పాతనోట్లు వున్నాయా.. కేసుల భయం వలదు..

Posted: 11/03/2017 04:13 PM IST
No action against those still having old notes says centre

మీ వద్ద రద్దైన పాత నోట్లు వున్నాయా..? అంటే ఒకటో రెండు వున్నా అబ్బే మా వద్ద ఎక్కడున్నాయ్ లేవు అని చెప్పేవారి సంఖ్యే అధికం. కేంద్ర ఈ మేరకు తాజాగా తీసుకువచ్చిన అర్డినెన్సు నేపథ్యంలో అందోళన నేపథ్యంలో నోట్లు వున్నా లేనవి చెప్పేస్తున్నారు. అయితే ఇకపై మాత్రం రద్దు చేసిన పాత పెద్ద నోట్లు వుంటే కేసులు పెడతారన్నఅందోళన అవసరం లేదు. పాత నోట్ల రద్దు వ్యవహారంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వారకు ఈ పరిస్థితి కొనసాగనుంది.

ఈ మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రద్దు చేసిన పాత పెద్ద నోట్లు రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను కలిగి ఉండటం ఇక నేరం కాదని, పాత నోట్లు కలిగి వున్న వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలను తీసుకోబోమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు దీనిపై తుది నిర్ణయం ప్రకటించేంత వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది.

పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయనివారిపై కేంద్రం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోరుతూ సుధామిశ్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాగా, కేంద్ర ఈ మేరకు న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. రద్దయిన నోట్లను కలిగి ఉంటే భారీ జరిమానాలు తప్పవని గతంలో కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్ల వరకు మాత్రమే ఉండాలనే ఆర్డినెన్స్ ను కూడా కేంద్రం తీసుకొచ్చింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో నోట్లు ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  Supreme Court  SC  old notes  demonitised notes  sudha mishra  petition  centre  

Other Articles